సీనియ‌ర్ సిటిజ‌న్స్! ఆరోగ్యబీమా పాల‌సీ కొంటున్నారా? - Health-insurance-policies-for-senior-citizens
close

Published : 23/06/2021 12:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సీనియ‌ర్ సిటిజ‌న్స్! ఆరోగ్యబీమా పాల‌సీ కొంటున్నారా?

వ‌యోవృద్ధుల‌కు ఆరోగ్య సంర‌క్ష‌ణ ఎక్కువ‌గా అవ‌స‌రం, వారి విష‌యంలో ఖ‌ర్చులూ ఎక్కువే. ఇదే కార‌ణంతో వారి కోసం కొన్ని ప్ర‌త్యేక‌మైన పాల‌సీల‌ను బీమా సంస్థ‌లు అందిస్తున్నాయి.

ఏమేం చూడాలి?
సీనియ‌ర్ సిటిజ‌న్స్ కోసం కొన్ని  ప్రత్యేక సేవ‌లను పాల‌సీతో పాటు అందిస్తున్నారు. అవి ఇంటి వ‌ద్ద సంర‌క్ష‌ణ‌, వెల్‌నెస్ సంబంధిత సేవ‌లు లాంటివ‌న్న మాట‌. సీనియ‌ర్ సిటిజ‌న్స్ కోస‌మే ప్ర‌త్యేకంగా ఆరోగ్య పాల‌సీ ఎంచుకోవాలంటే అంత సుల‌భం కాదు. అయితే ఇలాంటిది ఒక‌టి కొనేముందు ఏమేం చూడాలో ఇప్పుడు తెలుసుకుందాం..

సీనియ‌ర్ సిటిజ‌న్స్  పాల‌సీల్లో కొన్ని ప్ర‌త్యేక‌మైన‌ అనారోగ్యాల కోసం చెల్లించే ప‌రిహారంలో ప‌రిమితులు, ఉప‌-ప‌రిమితులు అనేకం ఉంటాయి. 

 ముందుగా ఉన్న‌ (ప్రీ-ఎగ్జిస్టింగ్) వ్యాధులు :
* సాధార‌ణంగా ఏదైనా ఆరోగ్య పాల‌సీ ప్రీ-ఎగ్జిస్టింగ్ వ్యాధుల‌కు నాలుగేళ్ల దాకా ఎలాంటి క‌వ‌రేజీని ఇవ్వ‌వు. అయితే సీనియ‌ర్స్ సిటిజ‌న్స్ కోసం కొన్ని బీమా సంస్థ‌లు ఈ వెయిటింగ్ పీరియ‌డ్‌ని త‌గ్గించేస్తున్నాయి. 

ప్రీమియం :
*  సీనియ‌ర్స్ సిటిజ‌న్స్ ప్ర‌త్యేకమైన పాలసీలలో  ప్రీమియం ఎక్కువగా   ఉంటుంది.  
* 60ఏళ్ల వ‌య‌సు త‌ర్వాత పాల‌సీ తీసుకునేవారికి ప్రామాణిక కో-పే ష‌ర‌తు పెడ‌తాయి బీమా సంస్థ‌లు. పాల‌సీ తీసుకునేవారు ఇది వ‌ర‌కు అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డితే వారికి కో-పే, ఉప‌-ప‌రిమితులు విధించ‌డం స‌ర్వ‌సాధార‌ణం.

తీవ్ర రుగ్మ‌త‌ల‌కు:
కీళ్ల నొప్పుల‌కు, ఊపిరితిత్తుల వ్యాధుల‌కు, గుండె సంబంధిత చికిత్స‌ల‌కు ప‌రిహారం ఇస్తున్న ప్రత్యేక పాల‌సీలను  కొనుగోలు చేసే ముందు ఎన్నో అంశాల‌ను గ‌మ‌నించాల్సి ఉంటుంది.  అవి...  
*  వెయిటింగ్ పీరియ‌డ్‌
*  సుల‌భంగా కొన‌గ‌లిగేలా ఉండ‌డం
*  మెడిక‌ల్ స్క్రీనింగ్ కోసం ముంద‌స్తు అనుమ‌తి
*  ఔట్ పేషెంట్ సేవ‌ల‌కు క‌వ‌రేజీ

ప‌ద‌వీ విర‌మ‌ణ దాకా వేచి చూడ‌కండి
ప్ర‌స్తుతం మీ కంపెనీ బృంద ఆరోగ్య పాల‌సీలో మిమ్మ‌ల్ని భాగం చేసిన‌ట్ల‌యితే మీ ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సు దాకా ఆగడం మంచిది కాదు .  ముందుగా కొన్న‌ట్ల‌యితే ఏవైనా అనారోగ్య స‌మ‌స్య‌లకు వెయిటింగ్ పీరియ‌డ్ కూడా అయిపోయి మీ ప‌ద‌వీ విర‌మ‌ణ నాటికి ప‌రిమితులుకాటరా లేని పూర్తి పాల‌సీ అందుబాటులోకి వ‌స్తుంది. అనారోగ్య‌ ప‌రిస్థితులు ఉన్న‌ సీనియ‌ర్స్ సిటిజ‌న్స్ కు పాల‌సీ ఇచ్చేందుకే బీమా సంస్థ‌లు విముఖత చూపిస్తాయి. అందువలన చిన్న వయసులో ఆరోగ్య బీమా పాలసీ తీసున్నట్లైతే , వయసు పెరిగాక కూడా  తక్కువ ప్రీమియంతో కొనసాగవచ్చు. 
 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని