ఎంత కావాలి...ఆరోగ్య బీమా? - Need-of-health-insurance
close

Published : 15/06/2021 15:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎంత కావాలి...ఆరోగ్య బీమా?

పెరుగుతున్న వైద్య ఖర్చులను తట్టుకోవడానికి ఆరోగ్య బీమా తీసుకోవడం అంత ఉత్తమం మరోటి లేదు.  మరి ఈ బీమాను ఎంత మొత్తానికి తీసుకోవాలి? ఈ ప్రశ్నకు సమాధానం మాత్రం అంత తేలికేమీ కాదు. జీవిత బీమాకూ ఆరోగ్య బీమాకూ మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. వార్షిక ఆదాయానికి ఇన్ని రెట్లు జీవిత బీమా తీసుకుంటే సరిపోతుందని... లేదా ఒక వ్యక్తి ఆర్థిక పరిస్థితిని బట్టి, ఎంత బీమా తీసుకుంటే ధీమాగా ఉండవచ్చో తేలిగ్గా సూత్రీకరించవచ్చు. కానీ, ఆరోగ్య బీమా విషయంలో ఇలా చెప్పడం ఎంతో కష్టం. ఎందుకంటే.. అనారోగ్యం ఏ రూపంలో వస్తుందో.. దానికి ఎంత ఖర్చవుతుందో ముందుగానే ఊహించడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. మరి కుటుంబానికి అనారోగ్యంలో ఆర్థిక అండగా ఉండాలంటే.. ఆరోగ్య బీమా పాలసీని ఎంత మొత్తానికి తీసుకోవాలి? ఈ ప్రశ్నకు సమాధానం కొంచెం కష్టమే అయినప్పటికీ కొన్ని అంశాల ఆధారంగా దీని విషయంలోనూ ఒక నిర్ణయానికి రావచ్చు.

వయసెంత?
ఆరోగ్య బీమా పాలసీని ఎంతకు తీసుకోవాలని నిర్ణయించుకునేముందు వయసును పరిగణనలోనికి తీసుకోవడం మర్చిపోవద్దు. ఎంత చిన్న వయసులో పాలసీని తీసుకుంటే అంత మంచిది. 

ఉదాహరణకు 35 ఏళ్ల వయసు వ్యక్తి వ్యక్తిగత పాలసీ తీసుకోవాలని భావించినప్పుడు కనీసం రూ. 3-5 లక్షల బీమా హామీతో  పాలసీని ఎంచుకోవాలి. ఆ తర్వాత నుంచి ఏటా కనీసం 10 నుంచి 15శాతం పాలసీ విలువను పెంచుకుంటూ వెళ్లాలి. అదే సమయంలో ముందస్తు వ్యాధులు ఉండటానికి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కొన్ని బీమా సంస్థలు 46 ఏళ్లు ఆ పైన ఉన్నవారికి, ముఖ్యంగా  సీనియర్‌ సిటిజన్లకు (60 ఏళ్లు దాటిన వారికి) ప్రత్యేక పాలసీలను అందిస్తున్నాయి. ఇందులో ప్రత్యేకతలు కూడా ఉంటాయి. సాధారణ పాలసీల్లోలాగా వేచి ఉండే సమయం అంత ఎక్కువగా ఉండకపోవచ్చు. అందుకే, పాలసీలను ఎంచుకునేప్పుడు మీ వయసు ఆధారంగా ఏమైనా ప్రత్యేక పథకాలు ఉన్నాయా అన్నది కూడా ఒకసారి చూడటం ఉత్తమం.

మారుతున్న అవసరాలకు తగ్గట్టుగా..
జీవితంలోని వివిధ దశలను బట్టి, బీమా అవసరాలు కూడా మారుతుంటాయి. కాబట్టి, ఆరోగ్య బీమా హామీ నిర్ణయించేటప్పుడు  మీ అవసరాలేమిటి అన్నది కూడా చూసుకోవాలి. అప్పుడే సరైన మొత్తానికి పాలసీని తీసుకోవడానికి వీలవుతుంది. మీకు పెళ్లయితే.. జీవిత భాగస్వామికి కూడా ఆరోగ్య బీమా రక్షణ కల్పించాలి. పిల్లలు పుట్టిన వెంటనే వారిని కూడా ఆరోగ్య బీమా పరిధిలోకి తీసుకురావాలి. అప్పుడు వారిని  కూడా దృష్టిలో పెట్టుకొని పాలసీ సరిపోతుందా లేదా అన్నది సమీక్షించుకోవాలి. 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని