SIP: 15-15-15 నియ‌మంతో రూ.2 కోట్లు సమకూర్చడం ఎలా? - How Much Should You Invest in Mutual Funds to get Rs 2 Crore
close

Updated : 20/11/2021 15:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

SIP: 15-15-15 నియ‌మంతో రూ.2 కోట్లు సమకూర్చడం ఎలా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: ల‌క్ష్యం పెద్ద‌ద‌యిన‌ప్పుడు పెట్టుబ‌డుల విష‌యంలో బాధ్యతగా మెల‌గాల్సి ఉంటుంది. క్ర‌మ‌శిక్ష‌ణ‌తో వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంది. యువ‌త ఇప్పుడు పెట్టుబ‌డులపై  ఆసక్తి చూపుతున్నారు. అయితే ఎందులో ఎలా పెట్టుబ‌డి పెట్టాలి అనే అంశాల‌పై స్ప‌ష్ట‌త లోపించ‌డంతో కొంత త‌డ‌బ‌డుతున్నారు. మంచి రాబ‌డి పొందాలంటే కొంత రిస్క్ తీసుకోక త‌ప్ప‌దు. మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో మ‌దుపు చేసేవారు కొన్ని నియ‌మాలు పాటించ‌డం ద్వారా అనుకున్న స‌మ‌యం కంటే ముందుగానే అధిక మొత్తంలో డ‌బ్బును కూడ‌బెట్ట‌గ‌లుగుతారు. ఆ కోవ‌కి చెందిందే 15-15-15 రూల్‌. ఈ నియ‌మాన్ని అనుస‌రించి 15 సంవ‌త్స‌రాల్లో రూ.2 కోట్ల‌ను ఎలా స‌మ‌కూర్చుకోవ‌చ్చో ఇప్ప‌డు చూద్దాం.. 

మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో సిప్ విధానంలో నెల‌కు రూ.15 వేలు పెట్టుబ‌డి పెడుతూ 15 సంవ‌త్స‌రాల్లో కోటీశ్వ‌రుడు కావ‌చ్చు. ఈ నియ‌మం ప్ర‌కారం రాబ‌డి అంచ‌నా 15 శాతం. మ్యూచ‌వ‌ల్ ఫండ్ల‌లో దీర్ఘ‌కాలంలో పెట్టుబ‌డులు చేస్తే మంచి రాబ‌డిని పొంద‌చ్చని నిపుణ‌లు చెబుతున్నారు. గ‌త చ‌రిత్ర కూడా ఇదే విష‌యాన్ని చెబుతోంది. ల‌క్ష్యం కోసం ఎక్కువ స‌మ‌యం ఉన్న‌ప్పుడు సిప్ స్టెప్‌-అప్ విధానాన్ని ఎంచుకుంటే అదే స‌మ‌యంలో రాబ‌డి రెట్టింపు అవుతుంది. అంటే రూ.1 కోటి పొందే చోట రూ. 2 కోట్ల వ‌ర‌కు స‌మ‌కూర్చుకోవచ్చు. 

ఏమిటీ 15-15-15 రూల్‌?
ఈ రూల్‌లో ‘15’ను మూడు సార్లు ఉప‌యోగిస్తున్నాం. ఇది వృద్ధి రేటు, కాల‌వ్యవధి, నెలవారీ మనం చేయాల్సిన పొద‌పు మొత్తాన్ని సూచిస్తుంది. 15 శాతం రాబ‌డి అంచ‌నాతో 15 సంవ‌త్సరాల్లో (180 నెల‌లు) రూ.1 కోటి స‌మ‌కూర్చుకునేందుకు ప్రతి నెలా రూ.15000 ఆదా చేయాల్సి ఉంటుంది. మ‌రోవిధంగా చెప్పాలంటే.. ప్రతి నెలా మీరు రూ.15000 పెట్టుబ‌డి పెట్టగలిగితే 15 సంవత్సరాల్లో 15 శాతం రాబ‌డి అంచ‌నాతో కోటి రూపాయ‌ల ల‌క్ష్యాన్ని సాధించ‌గ‌లుగుతారు. 

స్టెప్‌-అప్‌ను ఎంచుకుంటే..?
ఉద్యోగులకు ప్రతి ఏడాది ఇంక్రిమెంట్ వ‌స్తుంది. అలాగే వృత్తి వ్యాపారాల్లో ఉన్న వారికి కూడా వార్షిక ఆదాయం పెరుగుతుంటుంది. పెరిగిన ఆదాయంతో పాటు పెట్టుబ‌డుల‌కు మ‌ళ్లించే మొత్తం కూడా పెర‌గాలి. ఇదే స్టెప్‌-అప్ సిప్‌. అంటే 15-15-15 రూల్ కి మ‌రో15 తోడ‌వ్వాలి. అంటే ప్రతి ఏడాది నెల‌వారీ పెట్టుబ‌డుల‌లో  15 శాతం వార్షిక స్టెప్‌ను జ‌త‌చేయాలి. చాలా వరకు మ్యూచువల్ ఫండ్ వెబ్‌సైట్లు, యాప్‌లు స్టెప్ అప్ సిప్ అందిస్తున్నాయి. ఒకవేళ ఇది వీలు కాకపోతే మీరు మరో సిప్ ను మొదలు పెట్టవచ్చు లేదా సిప్ మొత్తాన్ని పెంచమని మ్యూచువల్ ఫండ్‌ను కోరొచ్చు. 

ద్ర‌వ్యోల్బణాన్ని అధిగ‌మించ‌వ‌చ్చు..
స్టెప్‌-అప్ సిప్‌తో ద్ర‌వ్యోల్బణాన్ని సమర్థంగా ఎదర్కోవచ్చు. పెట్టుబ‌డుల మూల‌ధ‌నం పెరగ‌డంతో పాటు.. కాంపౌండింగ్ వ‌డ్డీ ప్ర‌భావంతో ద్ర‌వ్యోల్బణాన్ని మించిన‌ రాబ‌డి పొంద‌డంలో స్టెప్‌-అప్ సిప్ మ‌దుప‌ర్ల‌కు స‌హాయ‌ప‌డుతుంది. ప్ర‌తి సంవ‌త్స‌రం మీరు ఎంత ఎక్కువ పెట్టుబ‌డులు చేస్తే అంత ఎక్కువ సమకూర్చుకోవచ్చు. దీంతో మీరు మీ ల‌క్ష్యాన్ని అనుకున్న స‌మ‌యం కంటే ముందుగానే చేరుకోవ‌చ్చు.

సాధారణ సిప్ ద్వారా...

* ఇక్క‌డ కావ‌ల‌సిన సంప‌ద: రూ.1 కోటి
* 15 సంవత్సరాల్లో మీరు మదుపు చేసే మొత్తం: రూ.27,00,000
* రాబ‌డి (15 శాతం వార్షిక అంచ‌నాతో): రూ.74,52,946
* మొత్తం: రూ.1,01,52,946

స్టెప్ అప్ విధానంలో...

* కావ‌ల‌సిన సంప‌ద‌: రూ.2 కోట్లు
* 15 సంవత్సరాల్లో మీరు మదుపు చేసే మొత్తం: రూ.85,64,474
* వార్షిక స్టెప్-అప్ 15 శాతం
* రాబ‌డి (15 శాతం వార్షిక అంచ‌నాతో): రూ.1,19,66,143.
* మొత్తం: రూ.2,05,30,617.

సిప్ ఆరంభిస్తే కచ్చితమైన రాబడి వస్తుందని ఊహించలేం. మార్కెట్ హెచ్చుతగ్గుల వల్ల ఫండ్లలో రాబడి కూడా మారవచ్చు. కాబట్టి, మార్కెట్ పడినప్పుడు కొంత మొత్తాన్ని మదుపు చేస్తూ ఉండడం వల్ల అధిక యూనిట్స్ సమకూర్చుకుంటూ ఉండొచ్చు.

Read latest Business News and Telugu News


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని