మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులలో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) బాగా ప్రాచుర్యం పొందింది. మార్కెట్లో క్రమానుగతంగా పెట్టుబడులు పెట్టడానికి సిప్‌లు ఉత్తమమైన మార్గమని మ్యూచువల్ ఫండ్ నిపుణుల అభిప్రాయం. పెట్టుబడిదారులు ఎంచుకున్న మ్యూచువల్ ఫండ్ కోసం ప్రతి నెలా ఒక నిర్దిష్ట పొదుపు ఖాతా నుంచి నిర్ణీత మొత్తాన్ని డెబిట్ చేసి సిప్ ఖాతాలో జమవుతుంది. ఒకేసారి ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టలేనివారికి ఈ క్రమానుగత పెట్టుబడులు బాగా ఉపయోగపడతాయి. నెలకు రూ.500 తో సిప్ ప్రారంభించవచ్చు. దీర్ఘకాలంలో మంచి లాభాలను పొందవచ్చు.
ఆన్లైన్లో సిప్ ప్రారంభించవచ్చు:
1) సిప్ ప్రారంభించడానికి పాన్ కార్డ్, చిరునామా దృవీకరణ పత్రం, ఫోట్, చెక్ బుక్ అవసరం.
2) మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టడానికి ముందు కేవైసీ తప్పనిసరి పూర్తిచేయాలి.
3) కేవైసీ తర్వాత, ఫండ్ హౌస్ వెబ్సైట్లో మీకు నచ్చిన సిప్‌ను ఎంచుకోవచ్చు.
4) క్రొత్త ఖాతాను నమోదు చేయడానికి అక్కడ రిజిస్టర్ చేసుకోవాలి.
5) అప్పుడు ఒక దరఖాస్తు ఫారమ్ కనిపిస్తుంది, దీనిలో మీరు అన్ని వ్యక్తిగత వివరాలు, సంప్రదింపు సమాచారాన్ని అందించి ఫారమ్‌ను సమర్పించాలి.
6) ఆన్లైన్లో లావాదేవీల కోసం వినియోగదారు పేరు, పాస్‌వర్డ్‌ను ఎంచుకోండి.
7 సిప్ చెల్లింపులు డెబిట్ చేయాల్సిన బ్యాంక్ ఖాతా వివరాలను అందించండి.
8) మీ యూజర్ ఐడీతో లాగిన్ అయితన తర్వాత పెట్టుబడి పెట్టాలనుకుంటున్న పథకాన్ని ఎంచుకోండి.
9) రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత, ఫండ్ హౌస్ నిర్ధారణ కోసం సందేశం పంపుతుంది. అప్పుడు పెట్టుబడి ప్రారంభించవచ్చు.
10) సిప్‌లు సాధారణంగా 35-40 రోజుల విరామం తర్వాత ప్రారంభమవుతాయి.
సిప్ ప్రయోజనాలు:
ఇప్పుడే పెట్టుబడుల్లోకి ప్రవేశించిన వారికి, మార్కెట్ రిస్క్‌ను తగ్గించే విధంగా వారి డబ్బును ఉంచడానికి ఉత్తమ ఎంపికలలో సిప్ ఒకటి. ఇది పెట్టుబడులకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది, ఎందుకంటే ప్రతి నెలా ఎటువంటి ఇబ్బంది లేకుండా చిన్న మొత్తంలో ఖాతాలో జమచేసేందుకు అనుమతిస్తుంది. వాస్తవానికి, మీ బ్యాంక్ ఖాతా నుంచి ఆటో డెబిట్ కోసం ఫండ్ హౌస్‌కు స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ (ఎస్ఐ) ను కూడా ఇవ్వవచ్చు.
సిప్ ద్వారా మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల కలిగే ఒక పెద్ద ప్రయోజనం ఏమిటంటే, మీ పెట్టుబడితో పాటు వడ్డీపై కూడా రాబడి పొందుతారు. మీరు మ్యూచువల్ ఫండ్‌లో రూ.1000 , 10 శాతం రాబడితో పెట్టుబడి పెట్టండి అనుకుందాం. ఒక సంవత్సరం తరువాత, సంపాదించిన వడ్డీ రూ. 100 అవుతుంది. తర్వాత సంవత్సరం నుంచి మీరు మొత్తం రూ. 1,100 పై వడ్డీని సంపాదిస్తారు.
మరిన్ని
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. హాయ్ సిరి, నా పేరు శ్రీధర్. నేను రూ. 50 లక్షలకు టర్మ్ పాలసీ తీసుకుందాం అని అనుకుంటున్నాను , మంచి టర్మ్ పాలసీ చెప్పగలరు.
-
Q. నా పేరు ప్రదీప్, హైదరాబాద్ లో నివసిస్తాను. నేను హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రో గ్రోత్ ప్లస్ డెత్ బెనిఫిట్ ప్లాన్ లో గత 3 ఏళ్ళు గా సంవత్సరానికి రూ. 30,000 మదుపు చేస్తున్నాను. హెచ్డీఎఫ్సీ వారు నాకు ఈ పధకం 5 ఏళ్ళు మాత్రమే అని చెప్పారు, అయితే ఇప్పుడు పాలసీ లో చుస్తే 15 ఏళ్ళు అని చూపిస్తోంది. ఈ విషయమై ఆరా తీస్తే కనీస పరిమితి 5 ఏళ్ళు , ఆ తరువాత దీన్ని కొనసాగించాలా వద్ద అనే నిర్ణయం మనం తీసుకోవచ్చని తెలిసింది. ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని కొనసాగించాలా వద్దా? ఇంకా ఎందులో అయితే బాగుంటుంది?
-
Q. సర్ నేను ఏటీఎంలో విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించినప్పుడు నగదు రాలేదు కాని ఖాతా నుంచి డెబిట్ అయింది. బ్యాంకులో ఫిర్యాదు చేసి 15 రోజులు అయింది. కానీ ఇప్పటి వరకు నగదు తిరిగి క్రెడిట్ కాలేదు. బ్యాంకు వారు ఫిర్యాదుకు సరిగా స్పందించడంలేదు. ఇప్పుడు ఏం చేయాలి?