పసిడి బాండ్లు..గోల్డ్ ఎంఎఫ్‌లు.. ఏది మేలు? - gold-mutual-funds-are-a-better-option-than-sovereign-gold-bonds
close

Updated : 13/07/2021 16:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పసిడి బాండ్లు..గోల్డ్ ఎంఎఫ్‌లు.. ఏది మేలు?

ఇంటర్నెట్‌ డెస్క్‌: సార్వ‌భౌమ పసిడి బాండ్లు జులై 12 నుంచి అందుబాటులోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. గ్రాము ధ‌ర రూ.4,807 గా నిర్ణ‌యించారు. బంగారం కొనుగోలు చేయాల‌నుకునేవారికి ఈ ప‌సిడి బాండ్లు మంచి ఆప్ష‌న్ అయిన‌ప్ప‌టికీ.. పెట్టుబ‌డ‌దారుల‌కు అంత మంచి ఆప్ష‌న్ కాక‌పోవ‌చ్చ‌నేది ఆర్థిక స‌ల‌హాదారుల అభిప్రాయం. ఇప్ప‌టికే వైవిధ్య‌మైన‌ కేటాయింపుతో పోర్ట్‌ఫోలియో ఉన్న పెట్టుబడిదారులు ఈ ప‌సిడి బాండ్ల‌ను కొనుగోలుచేయ‌క‌పోవ‌డ‌మే మంచిద‌ని చెబుతున్నారు. వారు గోల్డ్ ఈటీఎఫ్ లేదా గోల్డ్ ఫండ్ల‌ను ఎంచుకోవ‌డం తెలివైన నిర్ణ‌యంగా సూచిస్తున్నారు.

పెట్టుబడిదారులకు ప‌సిడి బాండ్ల‌ కంటే గోల్డ్‌ మ్యూచువల్ ఫండ్లను ఉపయోగించి ఆస్తి కేటాయింపును నిర్వహించడం సులభం. ఎందుకంటే బంగారం ధ‌ర‌లు పెరిగిన‌ప్పుడు  పెట్టుబడిదారులు ఆ విభాగంలో కేటాయింపులు త‌గ్గించి పోర్ట్‌ఫోలియోలను తిరిగి సమతుల్యం చేయాలనుకుంటే లిక్విడిటీ ఉండ‌దు. కాబ‌ట్టి, పోర్ట్‌ఫోలియో రీబ్యాలెన్సింగ్ విషయానికి వస్తే బంగారు ఈటీఎఫ్‌లు, బంగారు బాండ్లు ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని భావిస్తున్నారు.

వివాహాల వంటి కార్యక్రమానికి భవిష్యత్తులో బంగారం అవ‌స‌రం అనుకునేవారికి సార్వ‌భౌమ ప‌సిడి బాండ్లు ఉప‌యోగ‌క‌రంగా ఉంటాయి.  ఆభ‌ర‌ణాలు, నాణేలు వంటివి కొనుగోలు చేసి, లాకర్లలో దాచ‌డానికి బదులుగా, అలాంటి వారు ఈ ప‌సిడిబాండ్ల‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు. డిజిట‌ల్ రూపంలో ప్ర‌స్తుత ధ‌ర‌కు త‌క్కువ మొత్తంలో అంటే ఒక గ్రాము నుంచి కూడా పొందేందుకు వీలుండ‌టం మంచి స‌దుపాయం. అవ‌స‌రం అనుకున్న‌ప్పుడు మెచ్యూరిటీ ముగిసిన త‌ర్వాత బంగారాన్ని తీసుకోవ‌చ్చు.

పిల్ల‌ల వివాహం కోసం కొన్ని సంవత్సరాల ముందు ఆభరణాలను కొనుగోలు చేస్తే, ఆ స‌మ‌యానికి ఆ డిజైన్లు పాత‌వి కావొచ్చు. అలాగ‌ని నాణేలు లేదా బిస్కెట్‌లు కొని ఇంట్లో పెట్టుకుంటే అదొక భ‌యం. పోనీ లాకర్‌లో పెడ‌దామంటే ఛార్జీలు ఉంటాయి. అంతేకాకుండా త‌యారీ ఛార్జీలు నాణేలు కొనుగోలు చేసేట‌ప్పుడే కాకుండా వాటితో జువెల‌రీ కొనుగోలు చేసేట‌ప్పుడు కూడా చెల్లించాల్సి ఉంటుంది.

కాబట్టి, మీరు పోర్ట్‌ఫోలియోలో భాగంగా బంగారాన్ని కొనుగోలు చేస్తుంటే, గోల్డ్ మ్యూచువల్ ఫండ్ల‌కే పెట్టుబ‌డుల‌ను ప‌రిమితం చేయండి. భ‌విష్య‌త్తులో అవ‌స‌రాల కోసం అయితే ఈ గోల్డ్ బాండ్ల‌ను ఉప‌యోగించండని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని