ఆరో రోజూ పెట్రో ధరలు పైపైకే..
close

Updated : 14/02/2021 10:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆరో రోజూ పెట్రో ధరలు పైపైకే..

దిల్లీ: దేశంలో వరుసగా ఆరో రోజూ చమురు ధరలు పెరిగాయి. లీటరు పెట్రోల్‌, డీజిల్‌పై 34 పైసలు వరకు పెంచుతూ చమురు సంస్థలు ఆదివారం నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలతో ప్రస్తుతం దిల్లీలో లీటరు పెట్రోల్‌ రూ.88.73, డీజిల్‌ రూ. 79.06కు చేరింది. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో లీటరు పెట్రోల్‌ ధర రికార్డు స్థాయిలో రూ. 95.21కి ఎగబాకింది. డీజిల్‌ రూ.86.04కు పెరిగింది. హైదరాబాద్‌లోనూ పెట్రోల్‌పై 30 పైసలు.. డీజిల్‌పై 34 పైసలు పెరిగింది. దీంతో పెట్రోల్‌ ధర రూ.92.26, డీజిల్‌ రూ.86.23కి చేరింది. గత ఆరు రోజుల్లో లీటర్‌ పెట్రోల్‌పై రూ.1.81, డీజిల్‌పై రూ.1.90 పెరగడం గమనార్హం.

ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు లీటరుకు

నగరం           పెట్రోల్‌(రూ.)        డీజిల్‌(రూ.)

దిల్లీ                88.73            79.06
కోల్‌కతా             90.01            82.65    
ముంబయి          95.21            86.04
చెన్నై               90.96            84.16
బెంగళూరు          91.76            83.87
హైదరాబాద్‌         92.26            86.23
జైపుర్‌              94.83            87.07
లఖ్‌నవూ           87.36            79.33
తిరువనంతపురం    90.84            85.21

 

ఇవీ చదవండి...

ఓఎన్‌జీసీ లాభంలో 67% క్షీణత

రుణ ఆస్తుల్లో ముత్తూట్‌ ఫైనాన్స్‌ రికార్డు


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని