ఎస్‌బీఐ గృహ రుణ రేటు పెంపు
close

Updated : 06/04/2021 09:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎస్‌బీఐ గృహ రుణ రేటు పెంపు

దిల్లీ: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) గృహ రుణ రేటును 6.95 శాతానికి పెంచింది. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయని వెల్లడించింది. మార్చి 31 వరకు ఎస్‌బీఐ గృహరుణ రేటు  6.70 శాతంగా ఉంది. అప్పటివరకు రూ.75 లక్షల వరకు గృహరుణాలను 6.70 శాతానికి, రూ.75 లక్షల నుంచి రూ.5 కోట్ల రుణాలను రూ.6.75 శాతం వడ్డీకి ఇచ్చింది. దీంతో పాత రేటుతో పోలిస్తే కొత్త రుణ రేటు 25 బేసిస్‌ పాయింట్లు (0.25 శాతం) పెరిగింది. ఎస్‌బీఐ తాజా నిర్ణయంతో... ఇతర బ్యాంకులు సైతం గృహ రుణ రేట్లు పెంచే అవకాశం ఉంది. ఇక గృహరుణాలపై 0.40 శాతం ప్రాసెసింగ్‌ ఫీజును సైతం ఎస్‌బీఐ వసూలు చేయనుంది. కనిష్ఠంగా రూ.10000; గరిష్ఠంగా రూ.30000తో పాటు జీఎస్‌టీ విధించనుంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని