పేరుకే జీరో బ్యాలెన్స్‌ ఖాతాలు 
close

Updated : 12/04/2021 11:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పేరుకే జీరో బ్యాలెన్స్‌ ఖాతాలు 

కొన్ని రకాల సేవలపై అదనపు ఛార్జీలు
ఎస్‌బీఐ వసూళ్లే రూ.300 కోట్లు

ఐఐటీ-బాంబే అధ్యయనం

దిల్లీ: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) సహా పలు బ్యాంకులు నగదు నిల్వ అవసరం లేని (జీరో బ్యాలెన్స్‌) ఖాతాలు తెరుస్తూనే, వివిధ సేవల పేరిట ఆయా ఖాతాదార్ల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నాయని ఐఐటీ-బాంబే నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. ఎస్‌బీఐలో జీరో బ్యాలెన్స్‌ లేదా బేసిక్‌ సేవింగ్స్‌ బ్యాంక్‌ డిపాజిట్‌ ఖాతాదారులు (బీఎస్‌బీడీఏ) ఒక నెలలో నాలుగు లావాదేవీలు నిర్వహించాక, తదుపరి ప్రతి నగదు ఉపసంహరణకు వారి నుంచి బ్యాంక్‌ రూ.17.70 చొప్పున వసూలు చేస్తున్నట్లు అధ్యయనం పేర్కొంది. సుమారు 12 కోట్ల మంది బీఎస్‌బీడీఏ ఖాతాదారుల నుంచి 2015-20 మధ్య ఎస్‌బీఐ ఛార్జీల రూపేణ రూ.300 కోట్లకు వసూలు చేసినట్లు వెల్లడైంది.  2018-19లో రూ.72 కోట్లు, 2019-20లో రూ.158 కోట్లు ఇలా వసూలు చేసినట్లు ఐఐటీ బాంబే ప్రొఫెసర్‌ ఆశిష్‌ దాస్‌ వెల్లడించారు.
బీఎస్‌బీడీఏ ఖాతాదారుల లావాదేవీలు ఒక నెలలో 4 దాటాక, నెఫ్ట్, ఐఎంపీఎస్, యూపీఐ, భీమ్‌-యూపీఐ, డెబిట్‌ కార్డ్‌ చెల్లింపులు వంటి డిజిటల్‌ డెబిట్‌ లావాదేవీలు నిర్వహించినా ఒక్కో దానిపై రూ.17.70 ఛార్జీ విధించడం చాలా ఎక్కువని అధ్యయనం తెలిపింది.
2020 జనవరి నుంచి ఎస్‌బీఐ యూపీఐ/భీమ్‌-యూపీఐ, రూపే-డిజిటల్‌ లావాదేవీలపై సేవా ఛార్జీలను విధించడం లేదు. మిగతా డెబిట్‌ లావాదేవీలకు రూ.17.70 చొప్పున ఛార్జీ విధిస్తోంది.
* దేశంలో రెండో అతి పెద్ద బ్యాంక్‌ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) కూడా ఇలాంటి 3.9 కోట్ల ఖాతాల నుంచి రూ.9.9 కోట్లను ఇదే కాలంలో వసూలు చేసింది. 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని