ఆరు నెలల గృహ రుణ ఈఎంఐ రద్దు..
close

Updated : 26/03/2021 06:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆరు నెలల గృహ రుణ ఈఎంఐ రద్దు..

ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌..

పింఛనర్లకు గృహరుణ భారం తగ్గేలా ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ ఊరట కల్గించే నిర్ణయం తీసుకుంది. గృహ వరిష్ఠ పథకంలో భాగంగా రుణం తీసుకున్న డిఫైన్డ్‌ బెనిఫిట్‌ పెన్షన్‌ స్కీంలో ఉన్న వారికి ఆరు నెలల ఈఎంఐని రద్దు చేస్తున్నట్లు తెలిపింది. రుణ వ్యవధిలో 37, 38, 73, 74, 121, 122వ నెలల వాయిదాలకు ఇది వర్తించనుంది. ఈ నెలల్లోని వాయిదాలను అసలుకు సర్దుబాటు చేస్తామని ప్రకటించింది. పదవీ విరమణ పొందిన వారితోపాటు, ప్రస్తుతం ప్రభుత్వ రంగ బీమా సంస్థలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, రైల్వే, రక్షణ రంగం, ప్రభుత్వ బ్యాంకుల్లో పనిచేసే ఉద్యోగులకు గృహ వరిష్ఠ పేరుతో ప్రత్యేక గృహ రుణాన్ని అందిస్తోంది. 65 ఏళ్ల లోపున్న ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్లు ఈ పథకంలో భాగంగా రుణం తీసుకోవచ్చు. గరిష్ఠంగా 80 ఏళ్ల వయసు వచ్చేవరకూ, లేదా 30 ఏళ్ల వ్యవధికి ఈ రుణం తీసుకోవచ్చు. ఈ పథకం కింద ఇప్పటికి రూ.3వేల కోట్ల మేరకు రుణాలను మంజూరు చేసినట్లు సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వై.విశ్వనాథ్‌ గౌడ్‌ తెలిపారు. మరింత మందిని ఈ పథకంలోకి ఆకర్షించేందుకు ఈ వినూత్న ప్రయత్నం అని చెప్పారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని