స్కోరు బాగుంటేనే కార్డు..
close

Updated : 26/03/2021 06:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

స్కోరు బాగుంటేనే కార్డు..

క్రెడిట్‌ కార్డులు ఇచ్చేందుకు పోటీ పడుతున్న బ్యాంకులు.. ఇటీవల కాలంలో తమ పంథా మార్చుకున్నాయి. కరోనా తర్వాత చాలామంది ఆదాయాలు తగ్గడం, ఉద్యోగులకూ వేతనాల్లో కోతల్లాంటివి అమలు కావడంతో ఇప్పుడవి జాగ్రత్త పడుతున్నాయి. గతంలో తీసుకున్న రుణాలు, కార్డు బిల్లుల చెల్లింపులు ఏడాదికాలంగా ఎలా ఉన్నాయి.. అనేది క్షుణ్నంగా పరిశీలిస్తున్నాయి.
ఒకప్పుడు క్రెడిట్‌ స్కోరు 700-750కి అటూఇటూగా ఉన్నా.. బ్యాంకులు క్రెడిట్‌ కార్డులు, ఇతర హామీలేని రుణాలను మంజూరు చేసేవి. ఇప్పుడు వ్యక్తిగత రుణాలతోపాటు, కార్డుల జారీకి స్కోరు దాదాపు 780కి పైగా ఉంటేనే దరఖాస్తును పరిశీలిస్తున్నాయి. సాధారణంగా 750 కన్నా అధిక క్రెడిట్‌ స్కోరు ఉన్న వారిని బ్యాంకులు విశ్వసనీయ రుణగ్రహీతలుగా గుర్తిస్తాయి. ఇప్పుడు కావాల్సిన క్రెడిట్‌ స్కోరు పెంచడంతో చాలామందికి కార్డులు అందడం కష్టంగా మారుతోంది. గత ఏడాది కాలంలో ఈఎంఐలు సరిగా చెల్లించని వారికి, మారటోరియం ఉపయోగించుకున్న వారికీ రుణాలు అంత సులభంగా రావడం లేదు. గతంలో 700 ఉన్నా క్రెడిట్‌ కార్డులు ఇచ్చిన బ్యాంకులు ఇప్పుడు 720 పాయింట్లు దాటితేనే కార్డులిస్తున్నాయి. కాబట్టి, మీరు కొత్తగా కార్డు కావాలనుకుంటే.. ముందుగా మీ క్రెడిట్‌ స్కోరు ఎంతుందో చూసుకొని, దరఖాస్తు చేయడం ఉత్తమం.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని