ఎన్‌పీఎస్‌.. రూ.5లక్షల వరకూ వెనక్కి
close

Published : 18/06/2021 00:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎన్‌పీఎస్‌.. రూ.5లక్షల వరకూ వెనక్కి

జాతీయ పింఛను పథకాన్ని (ఎన్‌పీఎస్‌) మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు పింఛను  నిధి నియంత్రణ, అభివృధ్ధి ప్రాధికార సంస్థ (పీఎఫ్‌ఆర్‌డీఏ) కొన్ని నిబంధనలను సడలించింది. ఇందులో భాగంగా రూ.5 లక్షల లోపు ఎన్‌పీఎస్‌ నిధి ఉన్నవారు పదవీ విరమణ చేసినా.. ఎన్‌పీఎస్‌ నుంచి బయటకు రావాలని అనుకున్నా.. మొత్తం సొమ్మును వెనక్కి తీసుకునే వెసులుబాటును కల్పించింది. ఇప్పటివరకూ ఎన్‌పీఎస్‌ నుంచి పెట్టుబడిని పూర్తిగా వెనక్కి తీసుకునే వెసులుబాటు ఉండేది కాదు. రూ.2లక్షల మొత్తం దాటితే.. పదవీ విరమణ తర్వాత లేదా 60 ఏళ్ల తర్వాత కనీసం 40శాతంతో బీమా సంస్థలు అందించే యాన్యుటీ పథకాలను తప్పనిసరిగా కొనాల్సి వచ్చేది. మిగిలిన 60 శాతాన్ని ఒకేసారి వెనక్కి తీసుకునే వీలుండేది. ఇప్పుడు రూ.5లక్షల వరకూ ఎలాంటి యాన్యుటీ పథకాలను కొనాల్సిన అవసరం లేదు. దీంతోపాటు.. ఎవరైనా గడువుకు ముందే ఎన్‌పీఎస్‌ నుంచి బయటకు రావాలనుకుంటే.. ఇప్పటి వరకూ ఉన్న రూ.లక్ష పరిమితిని రూ.2.5 లక్షలకు పెంచారు. దీంతోపాటు ఎన్‌పీఎస్‌లో చేరే వయసు ఇప్పటివరకూ 65 ఏళ్లు ఉండగా.. దీన్ని 70 ఏళ్ల వయసుకు పెంచారు. అదే విధంగా పథకంలో 75 ఏళ్ల వయసు వచ్చే వరకూ కొనసాగవచ్చు. ఎన్‌పీఎస్‌ను మరింత విస్తృతం చేసేందుకు వీలుగా ఏజెంట్లూ ఈ పథకాన్ని అందించేందుకు వీలును కల్పించారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని