క్రెడిట్‌ స్కోరు.. లెక్క మారుతోంది..
close

Updated : 25/06/2021 05:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

క్రెడిట్‌ స్కోరు.. లెక్క మారుతోంది..

అప్పు తీసుకోవాలనుకున్నప్పుడు.. ఒక వ్యక్తి క్రెడిట్‌ స్కోరు ఎంతో కీలకమన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఏదేని రుణం తీసుకున్న, క్రెడిట్‌ కార్డు వాడుతున్న వారికే రుణ చరిత్ర, క్రెడిట్‌ స్కోరు ఉంటుంది. మరి, ఇలాంటివేమీ లేని వారికి స్కోరును ఎలా లెక్కిస్తారు? తొలిసారి రుణం తీసుకునే వారికి అర్హతను నిర్ణయించేందుకు ఏం చూస్తారు?

రుణాలు తీసుకున్న వారికే కాకుండా.. ఇతరులకూ క్రెడిట్‌ స్కోరు ఇచ్చేందుకు ఇప్పుడు ఎన్నో సంస్థలు అందుబాటులోకి వచ్చాయి. ఇవన్నీ కొత్త రుణ గ్రహీతలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నాయి. కేవలం రుణాలకు సంబంధించిన చెల్లింపుల వివరాలతోనే క్రెడిట్‌ స్కోరును గుర్తించకుండా.. ఒక వ్యక్తికి సంబంధించి ఇతర సమాచారాన్నీ ఇవి సేకరిస్తున్నాయి.

మెషిన్‌ లెర్నింగ్‌, కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే ఈ క్రెడిట్‌ స్కోరింగ్‌ సంస్థలు.. ఒక వ్యక్తి బ్యాంకు నిల్వ ఎంతుంది? అతను వివిధ బిల్లులను ఎలా చెల్లిస్తున్నాడు.. ఇ-కామర్స్‌ వెబ్‌సైట్లలో కొనుగోలు తీరు ఎలా ఉంది? ప్రయాణాలు చేస్తున్నారా? అక్కడికి వెళ్లినప్పుడు ఖర్చు ఎలా పెడుతున్నారు.. ఇలాంటి అంశాలన్నీ క్రోడీకరిస్తున్నాయి. సామాజిక వేదికలు, ఇంటర్నెట్‌ వాడకంలాంటివీ క్రెడిట్‌ స్కోరులో పరిగణనలోనికి తీసుకుంటున్నాయి. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు ఇలాంటి స్కోరును చూసి రుణాలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నాయి. కాబట్టి, రుణం తీసుకోవాలనుకునే వారు.. ఇక నుంచి బిల్లులు, బీమా పాలసీల చెల్లింపులు, ఫోన్‌ రీఛార్జీల వంటి  వాటి విషయంలోనూ కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే...


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని