Insurance: బాధ్యతలతోపాటు పెరిగే బీమా
close

Updated : 21/08/2021 09:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Insurance: బాధ్యతలతోపాటు పెరిగే బీమా

ఎస్‌బీఐ లైఫ్‌ ఇ-షీల్డ్‌ నెక్స్ట్‌

నూరేళ్ల వయసు వరకూ బీమా రక్షణ అందించడంతోపాటు, జీవితంలోని వివిధ దశల్లో బీమా రక్షణను పెంచుకునేందుకు వీలు కల్పించే వినూత్న పాలసీని ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఆవిష్కరించింది. పూర్తి రక్షణకే పరిమితమైన ఈ ఎస్‌బీఐ లైఫ్‌ ఇ-షీల్డ్‌ నెక్స్ట్‌ పాలసీలో మూడు రకాల ఐచ్ఛికాలను ఎంచుకునే అవకాశం ఉంది. పాలసీదారుల వివాహం, తల్లిదండ్రులుగా మారడం, నూతన ఇంటి కొనుగోలు ఇలా ప్రతి సందర్భంలోనూ హామీ ఇచ్చిన శాతంలో బీమా రక్షణను పెంచుకోవచ్చు. లెవల్‌ కవర్‌ బెనిఫిట్‌లో.. పాలసీ వ్యవధి మొత్తం ఒకే విలువ ఉంటుంది. ఇన్‌క్రీజ్‌ కవర్‌ బెనిఫిట్‌లో.. బాధ్యతలు పెరుగుతున్న ప్రతి సందర్భంలోనూ బీమా విలువ పెరుగుతంది. అయిదేళ్ల తర్వాత ఏడాదికి 10శాతం చొప్పున బీమా రక్షణ పెరుగుతుంది. ఇలా ప్రాథమిక పాలసీకి 100శాతం సమానంగా ఉంటుంది. ఇక మూడోది.. లెవల్‌ కవర్‌ విత్‌ ఫ్యూచర్‌ ఫ్రూఫింగ్‌ బెనిఫిట్‌.. ఇందులో వివాహం జరిగినప్పుడు పాలసీ మొత్తంలో 50శాతం (గరిష్ఠంగా రూ.50లక్షల వరకూ), మొదటి, రెండో బిడ్డ పుట్టిన సందర్భాల్లో 25శాతం చొప్పున (గరిష్ఠంగా రూ.25లక్షలు), ఇంటి కొనుగోలు చేసినప్పుడు 50శాతం (గరిష్ఠంగా రూ.50లక్షలు, రుణ మొత్తానికి సమానంగా.. ఏది తక్కువైతే అది) బీమా విలువ పెరుగుతుంది. పాలసీదారుడు మరణించిన సందర్భంలో పరిహారాన్ని ఏక మొత్తంగా లేదా.. నెలవారీ వాయిదాల రూపంలోనూ పొందే వీలుంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని