ఇప్పటిదాకా 1.19 కోట్ల ఐటీ రిటర్నులు - 1.19 crore IT returns so far
close

Updated : 09/09/2021 10:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇప్పటిదాకా 1.19 కోట్ల ఐటీ రిటర్నులు

కొత్త పోర్టల్‌ సమస్యలు పరిష్కారమవుతున్నాయ్‌: సీబీడీటీ

దిల్లీ: ఐటీ రిటర్నుల కొత్త పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయని ఆదాయ పన్ను(ఐటీ) విభాగం బుధవారం పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా 1.19 కోట్ల ఐటీ రిటర్నులు వచ్చాయని తెలిపింది. సెప్టెంబరు 7, 2021 వరకు పోర్టల్‌లోకి 8.83 కోట్ల మంది పన్ను చెల్లింపుదార్లు లాగిన్‌ అయ్యారని; సెప్టెంబరులో సగటున రోజువారీ సగటు లాగిన్‌ల సంఖ్య 15.55 లక్షలుగా ఉందని వివరించింది. 94.88 లక్షల ఐటీఆర్‌లను ఇ-ధ్రువీకరణ కూడా చేశారని.. ఇందులో 7.07 లక్షల ఐటీఆర్‌ల ప్రాసెస్‌ పూర్తయిందనితెలిపింది. ఆధార్‌-పాన్‌ అనుసంధానాన్ని 66.44 లక్షల మంది పన్ను చెల్లింపుదార్లు చేయగా.. 14.59 లక్షల ఇ-పాన్‌ల కేటాయింపు జరిగినట్లు తెలిపింది.


కొత్త కంపెనీలు 26% పెరిగాయి

2020-21లో 1.55 లక్షల నమోదు

దిల్లీ: గత ఆర్థిక సంవత్సరంలో (2020-21) కంపెనీల చట్టం కింద వ్యవస్థాపితమైన కొత్త కంపెనీల సంఖ్య 26 శాతం పెరిగి 1.55 లక్షలుగా నమోదయ్యాయని ఓ నివేదిక తెలిపింది. 2019-20లో ఈ సంఖ్య 1,22,721గా ఉంది. రూబిక్స్‌ డేటా సైన్సెస్‌ రూపొందించిన నివేదిక ప్రకారం.. కొత్త సంస్థల నమోదుపరంగా గత ఆర్థిక సంవత్సరం స్తబ్దుగానే ఆరంభమైంది. 2020 ఏప్రిల్‌లో రికార్డు కనిష్ఠ స్థాయిలో 3,209 కంపెనీలే నమోదు (రిజిష్టర్‌) అయ్యాయి. అయితే ఆర్థిక సంవత్సరం చివరి నెల అయిన 2021 మార్చిలో రికార్డు గరిష్ఠ స్థాయిలో 17,324 కంపెనీలు రిజిష్టర్‌ అయ్యాయి. కొవిడ్‌-19 రెండో దశ పరిణామాల ప్రభావం ఉన్నప్పటికీ 2021-22లోనూ కొత్త కంపెనీల సంఖ్య ఆశాజనకరీతిలోనే ఉండే అవకాశం ఉందని నివేదిక తెలిపింది. 2020-21లో తయారీ రంగంలో కొత్త కంపెనీల సంఖ్య 45 శాతం పెరిగి 33,483కి చేరింది. 2019-20లో ఈ రంగంలో 23,014 కొత్త కంపెనీలు వచ్చాయి.Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని