విపణిలోకి 10 కోట్ల స్మార్ట్‌ఫోన్లు - 10 crore smart phones into market
close

Published : 13/02/2021 12:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విపణిలోకి 10 కోట్ల స్మార్ట్‌ఫోన్లు

2020 జులై-డిసెంబరులో 
సైబర్‌మీడియా రీసెర్చ్‌ అధ్యయనం 

దిల్లీ: గత సంవత్సరం (2020) రెండో అర్ధభాగంలో భారత విపణిలోకి 10 కోట్ల స్మార్ట్‌ఫోన్లు సరఫరా అయ్యాయని సైబర్‌మీడియా రీసెర్చ్‌ నివేదిక వెల్లడించింది. ఫోన్లకు గిరాకీ పెరగడమే ఇందుకు కారణంగా తెలిపింది. 2020 మొత్త మీద మొబైల్‌ ఫోన్ల విపణిలో 19 శాతం వాటాతో శామ్‌సంగ్‌ మొదటి స్థానంలో ఉందని తెలిపింది. అయితే అక్టోబరు- డిసెంబరు త్రైమాసికంలో చైనాకు చెందిన షియామీ 27 శాతం వాటాతో అగ్రస్థానంలో నిలిచిందని పేర్కొంది. ‘2020 మొదటి అర్ధభాగంలో స్మార్ట్‌ఫోన్ల సరఫరా గణనీయంగా తగ్గడం, రెండో అర్ధభాగంలో కంపెనీలు బలంగా పుంజుకోడానికి తోడ్పడింది. ఆర్థిక వ్యవస్థ క్రమంగా గాడిన పడుతుండటం, ఇంటి నుంచి పని, ఆన్‌లైన్‌ తరగతులు కొనసాగడం కూడా స్మార్ట్‌ఫోన్‌ పరిశ్రమ వృద్ధికి కలిసివచ్చింది.

నివేదిక వివరాలు ఇలా.. 
* ♦అక్టోబరు- డిసెంబరులో శామ్‌సంగ్‌ 20 శాతం వాటాతో రెండో స్థానంలో నిలిచింది. వివో, రియల్‌మీ, ఒప్పోలు వరుసగా 14%, 11%, 10% చొప్పున మార్కెట్‌ విలువలతో మూడు, నాలుగు, ఐదో స్థానాల్లో ఉన్నాయి.  
ఫీచర్‌ ఫోన్ల మార్కెట్‌ వాటా 20 శాతంగా ఉంది. ఏడాదిక్రితంతో పోలిస్తే 2020 అక్టోబరు- డిసెంబరులో ఫీచర్‌ ఫోన్ల సరఫరాలు 2 శాతం తగ్గాయి. ఈ విభాగంలో శామ్‌సంగ్‌ మార్కెట్‌ వాటా 19% కాగా.. 17 శాతంతో లావా, 13 శాతంతో నోకియా, 5 శాతంతో కార్బన్‌ సంస్థలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ఇవీ చదవండి...

పారిశ్రామికోత్పత్తి కళకళ

బ్రిటన్‌లో అతిపెద్ద మాంద్యం


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని