12 సెకన్లలోపే 100 కి.మీ వేగం! - 100km per hr in less than 12 seconds
close

Updated : 14/01/2021 07:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

12 సెకన్లలోపే 100 కి.మీ వేగం!

టర్బోఛార్జ్‌డ్‌ పెట్రోల్‌ ఇంజిన్‌తో కొత్త ఆల్ట్రోజ్‌: టాటా మోటార్స్‌

దిల్లీ: తమ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ ఆల్ట్రోజ్‌ మోడల్‌లో కొత్త పెట్రోల్‌ వేరియంట్‌ను టాటా మోటార్స్‌ బుధవారం ఆవిష్కరించింది. ఈ నెల 22న కొత్త కారు ధరను ప్రకటించి, ఆ రోజు నుంచే విక్రయాలు ప్రారంభిస్తామని కంపెనీ తెలిపింది.ఈ కొత్త కారు 1.2 లీటర్‌ బై-టర్బోఛార్జ్‌డ్‌ పెట్రోల్‌ పవర్‌ట్రెయిన్‌ ఇంజిన్‌తో రూపొందినట్లు పేర్కొంది. 100 పీఎస్‌ సామర్థ్యంతో 12 సెకన్లలోపే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడం దీని ప్రత్యేకత. ఇప్పటికే కంపెనీ 86 పీఎస్‌ సామర్థ్యం గల 1.2 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌తో రూపొందిన ఆల్ట్రోజ్‌లను విక్రయిస్తోంది. అలాగే 1.5 లీటర్‌ డీజిల్‌ పవర్‌ట్రెయిన్‌ ఇంజిన్‌తో 90 పీఎస్‌ పవర్‌తో కార్లను ఉత్పత్తి చేస్తోంది. ‘ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 45,000 కార్లను విక్రయించాం. గిరాకీ బలంగా పెరుగుతోంది. కొత్త ఆల్ట్రోజ్‌తో విక్రయాల పరిమాణం మరింత పెరిగే అవకాశం ఉంద’ని దృశ్య మాధ్యమ విధానంలో కారు ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న టాటా మోటార్స్‌ హెడ్‌ మార్కెటింగ్‌, ప్రయాణికుల వాహనాల వ్యాపార విభాగం (పీవీబీవీ) వివేక్‌ శ్రీవాస్తవ వెల్లడించారు.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని