మెర్సిడెస్ బెంజ్ ఇండియా వెల్లడి
ఇంటర్నెట్డెస్క్: భారత్లో బెంజికార్లను ఆన్లైన్లో కూడా కొనేస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా మెర్సిడెస్ బెంజ్ ఇండియా వెల్లడించింది. ఈ కంపెనీ ఆన్లైన్ సేల్స్ 14శాతం వరకు ఉండటం విశేషం. గతేడాది బెంజ్ విక్రయాలు దాదాపు 42శాతం తగ్గాయి. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో లాక్డౌన్వంటివి దీనికి కారణంగా నిలిచాయి. కానీ, ఏడాది చివర్లో కంపెనీ పుంజుకొని కొవిడ్ ముందు నాటి స్థాయికి విక్రయాలను చేర్చింది. మొత్తం 7893 వాహనాలను విక్రయించింది.
కంపెనీ ఆన్లైన్ విక్రయాలు కూడా గణనీయంగా పుంజుకోవడం కలిసొచ్చింది. మొత్తం విక్రయాల్లో 1250 వాహనాలను ఆన్లైన్లో విక్రయించినట్లు కంపెనీ పేర్కొంది. కంపెనీ ఆన్లైన్ విభాగాన్ని ఏర్పాటు చేసిన 15 నెలల్లోనే ఈ స్థాయిలో విక్రయాలు చేయడం విశేషం. 2025 నాటికి మొత్తం అమ్మాకాల్లో 25 శాతం ఇంటర్నెట్లోనే జరుగుతాయని పేర్కొంది. భవిష్యత్తులో తమ ఈ కామర్స్ వేదికను మరింత అభివృద్ధి చేయనున్నట్లు కంపెనీ అధికారులు తెలిపారు. అలాగని తమ డిలర్షిప్స్ విషయంలో ఎటువంటి రాజీలేదని పేర్కొంది.
ఇదీ చదవండి
ఈ బ్యాటరీ జీవితకాలం 16 ఏళ్లు..!
మరిన్ని
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. హాయ్ సిరి, నా పేరు శ్రీధర్. నేను రూ. 50 లక్షలకు టర్మ్ పాలసీ తీసుకుందాం అని అనుకుంటున్నాను , మంచి టర్మ్ పాలసీ చెప్పగలరు.
-
Q. నా పేరు ప్రదీప్, హైదరాబాద్ లో నివసిస్తాను. నేను హెచ్డీఎఫ్సీ లైఫ్ ప్రో గ్రోత్ ప్లస్ డెత్ బెనిఫిట్ ప్లాన్ లో గత 3 ఏళ్ళు గా సంవత్సరానికి రూ. 30,000 మదుపు చేస్తున్నాను. హెచ్డీఎఫ్సీ వారు నాకు ఈ పధకం 5 ఏళ్ళు మాత్రమే అని చెప్పారు, అయితే ఇప్పుడు పాలసీ లో చుస్తే 15 ఏళ్ళు అని చూపిస్తోంది. ఈ విషయమై ఆరా తీస్తే కనీస పరిమితి 5 ఏళ్ళు , ఆ తరువాత దీన్ని కొనసాగించాలా వద్ద అనే నిర్ణయం మనం తీసుకోవచ్చని తెలిసింది. ఇప్పుడు నేనేం చేయాలి? దీన్ని కొనసాగించాలా వద్దా? ఇంకా ఎందులో అయితే బాగుంటుంది?
-
Q. సర్ నేను ఏటీఎంలో విత్డ్రా చేసేందుకు ప్రయత్నించినప్పుడు నగదు రాలేదు కాని ఖాతా నుంచి డెబిట్ అయింది. బ్యాంకులో ఫిర్యాదు చేసి 15 రోజులు అయింది. కానీ ఇప్పటి వరకు నగదు తిరిగి క్రెడిట్ కాలేదు. బ్యాంకు వారు ఫిర్యాదుకు సరిగా స్పందించడంలేదు. ఇప్పుడు ఏం చేయాలి?