Mercedes: భారత్‌లోకి సరికొత్త బెంజ్‌ ఎస్‌-క్లాస్‌..! - 2021 Mercedes Benz S Class Launched In India
close

Published : 17/06/2021 22:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Mercedes: భారత్‌లోకి సరికొత్త బెంజ్‌ ఎస్‌-క్లాస్‌..!

ఇంటర్నెట్‌డెస్క్‌: విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్‌ బెంజ్‌ సంస్థ భారత్‌లో సరికొత్త తరం ఎస్‌-క్లాస్‌ను విడుదల చేసింది. దీని ప్రారంభ ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.2.17 కోట్లుగా నిర్ణయించింది. ఈ ఏడాది బెంజ్‌ మార్కెట్లోకి విడుదల చేయనున్న 15 కార్ల మోడల్స్‌లో ఇది కూడా ఒకటి. దీనికోసం రూ.82,900 విలువైన సర్వీస్‌ ప్యాకేజీని కూడా అందుబాటులోకి తెచ్చింది. ఈ కారుకు 2021లో వరల్డ్‌ లగ్జరీ కార్‌ ఆఫ్‌ ది ఇయర్‌  అవార్డు వచ్చింది. కొత్త ఎస్‌-క్లాస్‌ పొడవు 33 ఎం.ఎం., వెడల్పు 51 ఎం.ఎం., ఎత్తు 12ఎం.ఎం. పెంచారు. ఈ కారుకు మరింత స్పోర్టీ లుక్‌ తీసుకొచ్చారు. సరికొత్త డిజిటల్‌ లైట్‌ టెక్నాలజీతో ఎల్‌ఈడీ ల్యాంప్‌లను అమర్చారు. ఈ కారు టెయిల్‌లైట్‌ డిజైన్‌ను పూర్తిగా మార్చేశారు. దీనికి ఫ్లష్‌ ఫిటింగ్‌ డోర్‌ హ్యాండల్స్‌ ఆకర్షణీయంగా ఉన్నాయి. దీనిలో ఎస్‌ క్లాస్‌ 400డీ, ఎస్‌ క్లాస్‌ 450 మ్యాటిక్‌ మోడల్స్‌ ఉన్నాయి. ఎస్‌ క్లాస్‌ 450 4మ్యాటిక్‌ ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.2.19 కోట్లు వరకు ఉంది. 

కారులోపల 12.8 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌, డిజిటల్‌ కన్సోల్‌ను అమర్చారు. కారుకు సరికొత్త  ఏసీబార్స్‌ బిగించారు. క్యాబిన్‌కు ఆప్షనల్‌గా పియానో బ్లాక్‌ ఉండ్‌ రంగుతో కార్బన్‌ ఫైబర్‌ ఫినిషింగ్‌ ఇచ్చారు.  బర్మ్‌స్టెర్‌ 4డీ సౌండ్‌ సిస్టమ్‌, 263 రకాల రంగులు మార్చుకొనేలా యాంబియంట్‌ లైటింగ్‌,  వాయిస్‌ అసిస్టెంట్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. మసాజ్‌ ఫంక్షన్‌ సీట్లను అమర్చారు. 

ఈ కారు పెట్రోల్‌, డీజిల్‌ ఇంజిన్లలో లభిస్తుంది. 400డీ మోడల్‌లో 3.0 లీటర్‌ సిక్స్‌సిలిండర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌కు ఈక్యూ బూస్ట్‌ 48 వాల్ట్‌ మైల్డ్‌ హైబ్రీడ్‌ సిస్టమ్‌ను ఇచ్చారు.  డీజిల్‌లో 3.0 లీటర్‌ ఇంజిన్‌ అమర్చారు. ఇది 325 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది. 450 4 మ్యాటిక్‌లో 3.0 లీటర్‌ ఇంజిన్‌ 362 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది. ఈ కార్లలో నైన్‌ స్పీడ్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ ఉంది. 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని