సరికొత్త హమ్మర్‌ ఇదే..! - 2024 GMC Hummer EV SUV Officially Unveiled
close

Published : 05/04/2021 20:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సరికొత్త హమ్మర్‌ ఇదే..!

ఇంటర్నెట్‌డెస్క్‌: జనరల్‌ మోటార్స్‌  ట్రక్‌ కంపెనీ  తన హమ్మర్‌ బ్రాండ్‌లో సరికొత్త వాహనాన్ని సిద్ధం చేస్తోంది.  దీనిలో భాగంగా కంపెనీ సరికొత్త హమ్మర్‌ ఈవీ ఎస్‌యూవీని తొలిసారి ప్రదర్శించింది. మరో రెండేళ్లలో దీనిని పూర్తిస్థాయిలో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తామని జీఎంసీ పేర్కొంది. అల్టియం ప్లాట్‌ఫామ్‌పై నిర్మించే ఈ వాహనాన్ని నాలుగు వెర్షన్లలో తయారు చేయనున్నారు. ఈవీ2,ఈవీ2ఎక్స్‌,ఈవీ3ఎక్స్‌,ఎడిషన్‌-1 రూపంలో దీనిని విక్రయించనుంది. వీటిల్లో ఎడిషన్‌-1 వెర్షన్‌లో పూర్తిస్థాయి సౌకర్యాలు ఉంటాయి. దీనిని 2023నుంచి విక్రయించనున్నారు.  దీని ధర దాదాపు 1,05,995 డాలర్లు ఉండొచ్చు.

ఈ కారు ఒక సారి ఛార్జి చేస్తే 402 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. దీనిలో ఇంజిన్‌ 616 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది. దీనికి ఆఫ్‌రోడ్‌ ప్యాకేజీని కూడా హమ్మర్ ఆఫర్‌ చేస్తోంది.  ఇక దీనిలో ఫుల్లీ లోడెడ్‌ వెర్షన్‌ ఒక సారి ఛార్జి చేస్తే 482 కిలోమీటర్లు ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ ఎడిషన్‌ 818 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది. ఇక కేవలం 3.5 సెకన్లలోనే గంటకు వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకొంటుంది. 

 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని