ఎన్‌పీఎస్‌, ఏపీవై ప‌థ‌కాల‌లో వృద్ధి - 23 growth in subscriber base under NPSAPY schemes
close

Updated : 16/04/2021 10:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎన్‌పీఎస్‌, ఏపీవై ప‌థ‌కాల‌లో వృద్ధి

నేష‌న‌ల్ పెన్ష‌న్ సిస్ట‌మ్‌ (ఎన్‌పీఎస్‌), అట‌ల్ పెన్ష‌న్ యోజ‌న (ఏపీవై) ప‌థ‌కాల కింద చందాదారుల సంఖ్య‌లో 23% వృద్ధిని `పీఎఫ్ఆర్‌డీఏ` న‌మోదు చేసింది.

2021 మార్చి 31 నాటికి అట‌ల్ పెన్ష‌న్ యోజ‌న (ఏపీవై) చందాదారులు 2.8 కోట్ల‌కు పైగా ఉన్నారు.

ఈ స్కీమ్‌ల నిర్వ‌హ‌ణ కింద మొత్తం ఆస్తులు 38% వృద్ధిని సాధించి రూ. 5.78 ల‌క్ష‌ల కోట్ల‌కు చేరుకున్నాయి.

పెన్ష‌న్ ఫండ్ రెగ్యులేట‌రీ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఆర్‌డీఏ) ప్ర‌ధాన ఎన్‌పీఎస్‌, ఏపీవై ప‌థ‌కాల కింద 23% వృద్ధితో 2021 మార్చి 31 నాటికి 4.24 కోట్ల‌కు పైగా చంద‌దారులను న‌మోదు చేసింద‌ని రెగ్యులేట‌ర్ తెలిపింది.

కోవిడ్‌-19 ప‌రిమితుల కార‌ణంగా గ‌త సంవ‌త్స‌రం చాలా స‌వాలుగా ఉన్నప్ప‌టికీ చందాదారుల సంఖ్య‌లో 23% పెరుగుద‌ల ఉంది. ఈ విష‌యం `పీఎఫ్ఆర్‌డీఏ` ఛైర్మ‌న్ సుప్ర‌తీం బందోపాధ్యాయ్ వ‌ర్చువ‌ల్ స‌మావేశంలో ప్రెస్‌కు తెలిపారు.

ఇందులో అట‌ల్ పెన్ష‌న్ యోజ‌న (ఏపీవై) చందాదారుల‌లో దాదాపు 33% వృద్ధిని న‌మోదు చేసింది. 77 ల‌క్ష‌ల‌కు పైగా కొత్త చందాదారులు చేరారు.

నేష‌న‌ల్ పెన్ష‌న్ సిస్టం (ఎన్‌పీఎస్‌) ప్ర‌ధానంగా కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌తో స‌హా వ్య‌వ‌స్థీకృత రంగాల వారికి ఈ సౌక‌ర్యాన్ని అందిస్తుంది. అయితే అట‌ల్ పెన్ష‌న్ యోజ‌న (ఏపీవై) ప్ర‌ధానంగా దేశంలోని అసంఘ‌టిత రంగంలో ప‌నిచేసే వారి కోసం ఉద్దేశించ‌బ‌డింది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని