తెలంగాణలో 25 లక్షల మంది వినియోగదారులు: హోండా 2వీలర్స్‌ - 25 lakh customers in Telangana Honda 2 Wheelers‌
close

Published : 31/12/2020 01:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తెలంగాణలో 25 లక్షల మంది వినియోగదారులు: హోండా 2వీలర్స్‌

ఈనాడు, హైదరాబాద్‌: వ్యక్తిగత రవాణాకు గిరాకీ పెరగడంతో ఈ ఏడాది ఏప్రిల్‌-నవంబరు మధ్య తెలంగాణ రాష్ట్రంలో లక్షకు పైగా ద్విచక్ర వాహనాలను విక్రయించినట్లు హోండా 2వీలర్స్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రాంతంలో బుధవారం నాటికి 25 లక్షల మైలురాయిని అధిగమించినట్లు  పేర్కొంది. 2001-2014 మధ్య కాలంలో మొదటి 10 లక్షల మంది వినియోగదారుల సంఖ్యను చేరుకోగా, తదుపరి ఆరేళ్లలో 15 లక్షల మంది వినియోగదారులను సంపాదించుకున్నట్లు వెల్లడించింది. స్కూటర్ల విభాగంలో ఈ ప్రాంతంలో 72శాతం మార్కెట్‌ వాటా సొంతం చేసుకున్నట్లు సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ డైరెక్టర్‌ యద్వీందర్‌ సింగ్‌ గులేరియా పేర్కొన్నారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని