2 బ్యాంకుల అమ్మకం.. ఈ నాలుగింటి నుంచేనా? - 4 govt banks shortlisted for privatisation
close

Published : 15/02/2021 19:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

2 బ్యాంకుల అమ్మకం.. ఈ నాలుగింటి నుంచేనా?

ఇంటర్నెట్‌డెస్క్‌: రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనలకు అనుగుణంగా వేగంగా అడుగులు పడుతున్నాయి. బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి పేర్కొన్న రెండు బ్యాంకుల విక్రయం కోసం ఇప్పటికే నాలుగు మధ్యస్థాయి బ్యాంకులను ఎంపిక చేసినట్లు సమాచారం. అందులో రెండింటిని ఎంపిక చేసి రాబోయే ఆర్థిక సంవత్సరంలో విక్రయించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

ఎంపిక చేసిన జాబితాలో బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఉన్నాయని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. వీటిలో ఏవైనా రెండు బ్యాంకులను ఎంపిక చేసి విక్రయిస్తారని సమాచారం. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వంటి భారీ బ్యాంకులను విక్రయిస్తే అటు ప్రజల నుంచి, యూనియన్ల నుంచి వచ్చే వ్యతిరేకతను తట్టుకోవడం ఇబ్బందికరమన్న ఉద్దేశంతో మధ్యస్థాయి బ్యాంకులను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. దీనికి తోడు ప్రభుత్వ పథకాలు గ్రామీణ స్థాయిలో చేరువ కావాలంటే ఎస్‌బీఐ వంటి బ్యాంకులు ప్రభుత్వానికి అవసరం.

బ్యాంక్ ఆఫ్‌ ఇండియాలో 50 వేలు, సెంట్రల్‌ బ్యాంక్‌లో 33 వేలు, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌లో 26వేలు, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రలో 13వేల మంది ఉద్యోగులు ప్రస్తుతం పనిచేస్తున్నట్లు ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. తక్కువ ఉద్యోగులు కలిగిన బ్యాంకులను తొలుత విక్రయించడం ద్వారా ఉద్యోగ సంఘాల వ్యతిరేకత కొంతవరకు తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే మధ్యస్థాయి బ్యాంకుల విక్రయం అనంతరం పరిణామాలను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్‌లో మరిన్ని బ్యాంకుల ప్రైవేటీకరణ వైపు ప్రభుత్వం అడుగులు వేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రైవేటీకరణకు కనీసం ఐదారు నెలలు పడుతుందని అంటున్నాయి. మరోవైపు రెండు బ్యాంకులు, ఓ బీమా కంపెనీని ప్రైవేటీకరించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆయా యూనియన్లు ఆందోళనలు ప్రారంభించాయి.

ఇవీ చదవండి..

ఈ ఏడాది వేతనాలు ఎంత పెరగొచ్చంటే..

వరుసగా ఏడోరోజు పెరిగిన ఇంధన ధరలు


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని