ఎఫ్‌డీల ద్వారా అందే 5 ముఖ్య‌మైన ప్ర‌యోజ‌నాలు - 5-benefits-of-bank-fixed-deposits
close

Updated : 05/05/2021 12:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎఫ్‌డీల ద్వారా అందే 5 ముఖ్య‌మైన ప్ర‌యోజ‌నాలు

బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాలున్నాయి.

ఈ రోజుల్లో, వివిధ బ్యాంకులు విలువ ఆధారిత బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌ను అందిస్తున్నాయి. ఈ విలువ ఆధారిత బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు బ్యాంక్ ఎఫ్‌డీ పెట్టుబ‌డిదారుల‌కు ఉచిత బీమా, ఆరోగ్య సంర‌క్ష‌ణ ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తున్నాయి.

ఒక బ్యాంక్ వినియోగ‌దారుడు త‌న బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌ మీద ఓవ‌ర్‌డ్రాఫ్ట్ స‌దుపాయానికి అర్హులు. బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ యొక్క ఈ ల‌క్ష‌ణం ఆర్ధిక అత్య‌వ‌స‌ర స‌మ‌యంలో పెట్టుబ‌డిదారుల‌కు నిధుల అవ‌స‌రానికి స‌హాయ‌ప‌డుతుంది.

బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) వ‌డ్డీ రేటు ఆస్తి కేటాయింపుకు మాత్ర‌మే ప్ర‌మాణం కాదు. బీమా, ఆరోగ్య సంర‌క్ష‌ణ వంటి బ్యాంక్ ఎఫ్‌డీ పెట్టుబ‌డిదారుల‌కు అనేక ఇత‌ర ప్ర‌యోజ‌నాలు అందుబాటులో ఉన్నాయి. బ్యాంక్ డిపాజిట్ 5 ఏళ్లు లేదా అంత‌కంటే ఎక్కువ ఉంటే ఆదాయ‌పు ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్ర‌కారం, బ్యాంక్ ఎఫ్‌డీ వివిధ ఆస్తి త‌ర‌గ‌తుల‌లో కొత్త సాధ‌నం కాదు. కానీ మార్కెట్ అధిక అస్థిర‌త‌తో మారిన‌పుడు ఇది మంచి పెట్టుబ‌డి ఎంపిక అని చాలాసార్లు రుజువు చేసింది. రిటైరైన వ్య‌క్తుల‌కు, సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు, రిస్క్‌కు దూరంగా ఉండేవారికి, ముఖ్యంగా మ‌హిళ‌ల‌కు,  అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో డ‌బ్బు అవ‌స‌రం ప‌డేవారికి ఫిక్స్‌డ్ డిపాజిట్లు మంచి ఆప్ష‌న్‌. ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌లో ముఖ్య‌మైన అంశం మెచ్యూర్ తేదికి డ‌బ్బు ఎంత వ‌స్తుంద‌నేది ముందుగానే తెలిసిపోతుంది. దీంతో మ‌న ప్ర‌ణాళిక‌ల‌కు అనుగుణంగా మ‌నం రెడీ కావ‌చ్చు. 

ఫిక్స్‌డ్ డిపాజిట్ల వ‌ల్ల డిపాజిట్‌దారుకు ల‌భించే 5 ముఖ్య‌మైన ప్ర‌యోజ‌నాలుః

1) ఓవ‌ర్ డ్రాఫ్ట్ సౌక‌ర్యంః ఒక బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ వినియోగ‌దారుడు డిపాజిట్ హామిపై ఓవ‌ర్ డ్రాఫ్ట్ స‌దుపాయాన్ని వాడుకోవ‌చ్చు. 

2) బీమా, ఆరోగ్య సంర‌క్ష‌ణ ప్ర‌యోజ‌నంః ఈ రోజుల్లో వివిధ బ్యాంకులు విలువ ఆధారిత బ్యాంక్ ఎఫ్‌డీల‌ను అందిస్తున్నాయి. ఈ విలువ ఆధారిత బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు బ్యాంక్ ఎఫ్‌డీ పెట్టుబ‌డిదారుల‌కు ఉచిత బీమా మ‌రియు ఆరోగ్య సంర‌క్ష‌ణ ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తున్నాయి.

3) ఆదాయ ప‌న్ను ప్ర‌యోజ‌నంః ఆదాయ ప‌న్ను చ‌ట్టం, 1961లోని సెక్ష‌న్ 80సీ కింద ఫిక్స్‌డ్ డిపాజిట్ దారుడు ప‌న్ను మిన‌హాయింపు పొంద‌టానికి పెట్టుబ‌డిదారుల‌కు స‌హాయ‌ప‌డే ప‌న్ను - పొదుపు బ్యాంక్, ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌ను భార‌తీయ బ్యాంకులు అందిస్తున్నాయి.

4) హామీ ఇచ్చే రాబ‌డి ప్ర‌యోజ‌నంః ముందే చెప్పిన‌ట్లుగా, బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ రాబ‌డి షేర్లు, స్థిరాస్తి మాదిరిగా మార‌వు. చిన్న వ‌య‌స్సులోనే పెట్టుబ‌డిదారుడు పెట్టుబ‌డి అల‌వాటును పెంపొందించ‌డానికి ఇది స‌హాయ‌ప‌డుతుంది. ఎందుకంటే 15 రోజుల నుండి 3 నెల‌ల వ‌ర‌కు చిన్న కాల‌ప‌రిమితి కోసం చిన్న మొత్తంతో బ్యాంక్ ఎఫ్‌డీలో పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు.

5) బ్యాంక్ ఎఫ్‌డీని నిర్వ‌హించ‌డానికి సౌల‌భ్యంః ఇపుడు బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ కొర‌కు బ్యాంకు శాఖ‌ను సంద‌ర్శించ‌డం, గంట‌ల త‌ర‌బ‌డి క్యూలో నిల‌బ‌డి వెయిట్ చేయ‌డం చేయ‌న‌క్క‌ర‌లేదు. ఈ ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్ యుగంలో, కంప్యూట‌ర్‌లో లేదా మొబైల్ ఫోన్‌లో కొన్ని నిమిషాలు కేటాయించ‌డం ద్వారా బ్యాంక్ ఎఫ్‌డిని తెర‌వ‌వ‌చ్చు లేదా మూసివేయ‌వ‌చ్చు.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని