ఇన్వెస్ట‌ర్ల‌కు రెట్టింపు లాభాలు పండించిన `ఐపీఓ`లు - 5-recent-IPOs-that-doubled-investors-money-on-listing-date
close

Updated : 31/07/2021 17:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇన్వెస్ట‌ర్ల‌కు రెట్టింపు లాభాలు పండించిన `ఐపీఓ`లు

ఇటీవ‌ల ఐపీఓల‌కు వ‌చ్చిన 5 కంపెనీల షేర్లు లిస్టింగ్ తేదీలోనే పెట్టుబ‌డిదారుల పెట్టుబ‌డిని దాదాపు రెట్టింపు చేశాయి. స్టాక్ మార్కెట్ నిపుణుల‌ ప్రకారం.. ఐపీఓల‌లో మాత్ర‌మే పెట్టుబ‌డి పెట్టే పెట్టుబ‌డిదారులు చాలా మందినే ఉన్నారు. ఐపీఓ లిస్ట్ చేయ‌బ‌డిన త‌ర్వాత వారు త‌మ‌కు అందుబాటులో ఉన్న లిస్టింగ్ లాభాల‌తో బ‌య‌ట‌కు వ‌చ్చేస్తారు. వీరికి ప‌బ్లిక్ ఇష్యూ లిస్ట్ అయిన త‌ర్వాత పెట్టిన పెట్టుబ‌డికి  రెట్టింపు లాభాలు అందుబాటులో ఉంటున్నాయి. స్టాక్ మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్ర‌కారం, కంపెనీ ప్ర‌మోట‌ర్లు కోవిడ్‌-19 త‌ర్వాత స్టాక్స్ సూచీలలో లాభాల ప్ర‌యోజ‌నాన్ని పొంద‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇటీవ‌ల ఐపీఓల సంఖ్య పెర‌గ‌డానికి ఈ కార‌ణం కూడా కావ‌చ్చు.

ఈ రోజుల్లో ఐపీఓ లిస్టింగ్ పెర‌గ‌డానికి గ‌ల కార‌ణం కోవిడ్‌-19 మొద‌టి వేవ్ త‌ర్వాత మార్కెట్ బ‌లంగా పుంజుకుంది. అందుకే ఈక్విటీ రిట‌ర్న్ అక‌స్మాత్తుగా అధిక‌మైంది. కాబట్టి, ప్లాన్ చేస్తున్న కంపెనీ ప్ర‌మోట‌ర్లు వారి కంపెనీ ఐపీఓల‌ను ప్రారంభించ‌డం జ‌రుగుతుంది. వారు కోవిడ్ అనంత‌ర రీబౌండ్‌లో మార్కెట్ వేగాన్ని స‌ద్వినియోగం చేసుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. పెట్టుబ‌డిదారులు కోవిడ్‌-19 స‌మ‌యాన కూడా  ఐపీఓల్లో పెట్టుబ‌డి పెడుతున్నారు. వారు ప‌బ్లిక్ ఇష్యూ నుండి పొందిన లిస్టింగ్ లాభాల‌తో త‌మ హోల్డింగ్‌ల నుండి బ‌య‌ట‌కు వ‌చ్చేస్తారు.

లిస్ట్ చేసిన తేదీలోనే బిడ్డ‌ర్ల డ‌బ్బు దాదాపు రెట్టింపు చేసిన‌ ఇటీవ‌ల కాలంలోని 5 ఐపీఓల‌ను ఇక్క‌డ చూడండి.

1) హ్యాపీయెస్ట్ మైండ్స్ ఐపీఓః ఈ బెంగ‌ళూరుకు చెందిన ఐటీ స‌ర్వీస్ కంపెనీ షేర్లు 17 సెప్టెంబ‌ర్ 2020న లిస్ట్ అయ్యాయి. దీని ప‌బ్లిక్ ఇష్యూ ధ‌ర రూ. 165-166 వ‌ర‌కు నిర్ణ‌యించ‌బ‌డింది. పబ్లిక్ ఇష్యూ బీఎస్ఈలో రూ. 351, ఎన్ఎస్ఈలో రూ. 350 వ‌ద్ద లిస్ట్ చేయ‌బ‌డింది. దీనిలో విజ‌య‌వంత‌మైన మ‌దుపుదార్ల‌కు 111 శాతానికి పైగా లాభం వ‌చ్చింది.

2) బ‌ర్గ‌ర్ కింగ్ ఐపీఓః దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న క్విక్ స‌ర్వీస్ రెస్టారెంట్ చైన్ షేర్లు 14 డిసెంబ‌ర్ 2020న ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో లిస్ట్‌ చేయ‌బ‌డ్డాయి. దీని ప‌బ్లిక్ ఇష్యూ ధ‌ర రూ. 59-60 వ‌ర‌కు నిర్ణ‌యించ‌బ‌డింది. బ‌ర్గ‌ర్ కింగ్ షేర్లు బీఎస్ఈలో రూ. 115.35, ఎన్ఎస్ఈలో రూ. 112.50 వ‌ద్ద లిస్టింగ్ చేయ‌బ‌డ్డాయి. దీనిలో విజ‌య‌వంత‌మైన మ‌దుపుదార్ల‌కు 92% లిస్టింగ్ లాభం వ‌చ్చింది.

3) తత్వ చింత‌న్ ఐపీఓః కెమిక‌ల్ స్పెషాలిటీ కంపెనీ షేర్లు `ఎన్ఎస్ఈ, బీఎస్ఈ` రెండింటిలోనూ 29 జులై 2021న లిస్టింగ్ చేయ‌బ‌డ్డాయి. ఐపీఓ విజ‌య‌వంతం అవ్వ‌డంతో బిడ్డ‌ర్ల‌కు 95% లిస్టింగ్ ప్రీమియంను అందిస్తున్నాయి. `త‌త్వ చింత‌న్‌` షేర్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో రూ. 2,111.85 వ‌ద్ద లిస్ట్ చేయ‌బ‌డ్డాయి. ఈ కంపెనీ ఐపీఓ ధ‌ర ఒక్కొ షేర్‌కి రూ. 1073-1083 వ‌ర‌కు నిర్ణ‌యించ‌బ‌డింది. లిస్టింగ్ చేసిన వెంట‌నే ఇది ఇంట్రాడేలో ఎన్ఎస్ఈలో రూ. 2,534.20, బీఎస్ఈలో రూ. 2,486.30ల‌తో అప్ప‌ర్ స‌ర్క్యూట్ స్థాయిల‌కు ద‌గ్గ‌ర‌గా చేరింది. కాబ‌ట్టి త‌త్వ‌చింత‌న్ షేర్ల‌ను కేటాయించిన వారికి, వారి పెట్టుబ‌డిపై 100% కంటే ఎక్కువ లాభాల‌ను బుక్ చేసుకునే అవ‌కాశం ఉంది.

4) జీఆర్ ఇన్‌ఫ్రా ఐపీఓః ఇంజ‌నీరింగ్ కంపెనీ షేర్లు 2021 జులై 19న ఎన్‌ఎస్ఈ, బీఎస్ఈల‌లో లిస్ట్ చేయ‌బ‌డ్డాయి. దీని విజ‌య‌వంత‌మైన బిడ్డ‌ర్ల‌కు 100% కంటే ఎక్కువ లిస్టింగ్ ప్రీమియం అందిస్తున్నాయి. జీఆర్ ఇన్‌ఫ్రా షేర్లు బీఎస్ఈలో రూ. 1700 వ‌ద్ద‌, ఎన్ఎస్ఈలో రూ. 1,715.85 వ‌ద్ద లిస్ట్ చేయ‌బ‌డ్డాయి. కాని దీని ప‌బ్లిక్ ఇష్యూ ధ‌ర రూ. 828-837 వ‌ర‌కు నిర్ణ‌యించ‌బ‌డింది. ప‌బ్లిక్ ఇష్యూ దాని ఆఫ‌ర్ కంటే 102.58 రెట్లు ఓవ‌ర్ స‌బ్‌స్క్ర‌యిబ్ చేయ‌బ‌డింది.

5) క్లీన్ సైన్స్ ఐపీఓః ఈ ర‌సాయ‌న త‌యారీ కంపెనీ షేర్లు 19 జులై 2021న స్టాక్ ఏక్స్ఛేంజీలో లిస్ట్ అయ్యాయి.  దీని ప‌బ్లిక్ ఇష్యూ ధ‌ర రూ. 880-900 వ‌ర‌కు నిర్ణ‌యించ‌బ‌డింది.  ఈ షేరు బీఎస్ఈలో రూ. 1,784.40 వ‌ద్ద‌, ఎన్ఎస్ఈలో రూ. 1,755 వ‌ద్ద లిస్ట్ చేయ‌బ‌డింది. దీని లిస్టింగ్ తేదీలో బిడ్డ‌ర్ల‌కు 98% లిస్టింగ్ లాభం వ‌చ్చే అవ‌కాశం ఉండింది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని