బడ్జెట్‌ 2020: 6 ఏళ్లలో వచ్చిన 6 మార్పులు
close

Published : 12/01/2021 16:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బడ్జెట్‌ 2020: 6 ఏళ్లలో వచ్చిన 6 మార్పులు

దిల్లీ: రెండోసారి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌కు సిద్ధమవుతోంది. అధికారంలో వచ్చిన ఆరేళ్లలో ఎన్నో మార్పులకు ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. బడ్జెట్‌ తేదీ మార్పు నుంచి ప్రతులను తీసుకొచ్చే సూట్‌ కేసు దాకా కొత్త సంప్రదాయాలకు తెరతీసింది. పన్ను విధానంలోనూ కొన్ని మార్పులు తీసుకొచ్చింది. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న వేళ 2014లో అధికారంలోకి వచ్చిన దరిమిలా మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులను ఓ సారి చూద్దాం..

1. బడ్జెట్‌ను ఏటా ఫిబ్రవరి నెల చివరి రోజు ప్రవేశపెట్టేవారు. ఆ సంప్రదాయానికి భిన్నంగా 2017లో ఫిబ్రవరి 1నే బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సంప్రదాయాన్ని తీసుకొచ్చారు. రైల్వే బడ్జెట్‌ను కూడా విలీనం చేశారు. అప్పటి వరకు వేర్వేరుగా ప్రవేశపెట్టే సంప్రదాయం ఉండేది.


2. బడ్జెట్‌ ప్రతులను సూట్‌కేసులో తీసుకొచ్చే సంప్రదాయానికి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ చరమగీతం పాడారు. ఓ వస్త్రంతో కూడిన బ్యాగులో ప్రతులను తీసుకొచ్చి 2019 బడ్జెట్‌ నుంచి కొత్త సంప్రదాయానికి తెరతీశారు.


3. వ్యక్తిగత ఆదాయపు పన్ను పరిమితిని 2014లో ఆర్థికమంత్రిగా ఉన్న అరుణ్‌జైట్లీ రూ.2 లక్షల నుంచి రూ.2.5లక్షలకు పెంచారు. సీనియర్‌ సిటిజన్లకు రూ.2.5 లక్షల నుంచి 3 లక్షలకు పెంచారు. సెక్షన్‌ 80సీ పన్ను మినహాయింపు పరిమితిని రూ.50వేల నుంచి 1.5 లక్షలకు పెంచారు.
4. 2015లో సంపద పన్నును కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. కోటి రూపాయలకు పైగా పన్ను ఆదాయం కలిగిన సంపన్నులకు అడిషనల్‌ సర్‌ఛార్జి కింద 2 శాతం పన్ను విధించారు.


5. 2016 బడ్జెట్‌లో రూ.10లక్షలకు పైగా వార్షికాదాయం కలిగిన వారికి అదనంగా 10శాతం ఆదాయపు పన్ను విధించారు. కోటి రూపాయలకు పైగా ఆదాయం కలిగిన వారికి సర్‌ఛార్జి మొత్తాన్ని 12 శాతం నుంచి 15 శాతానికి పెంచారు. 2017లో రూ.50 లక్షల నుంచి కోటి రూపాయలు ఆదాయం కలిగిన వారికి కొత్తగా 10 శాతం సర్‌ఛార్జి విధించారు.


6. 2017లో ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఊరట కల్పిస్తూ రూ.2.5-రూ.5లక్షలు మధ్య ఆదాయం ఉన్నవారికి పన్ను మొత్తాన్ని 10 శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించారు. సెక్షన్‌ 87ఏ కింద పన్ను రిబేట్‌ను కూడా రూ.5వేల నుంచి రూ.2,500కు తగ్గించారు. 2019లో స్టాండర్డ్‌ డిడక్షన్‌ మొత్తాన్ని రూ.50వేలకు పెంచారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని