బడ్జెట్‌ సమయంలో 11లక్షల ట్వీట్లు
close

Published : 12/01/2021 16:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బడ్జెట్‌ సమయంలో 11లక్షల ట్వీట్లు

న్యూదిల్లీ: భారత నెటిజన్లు బడ్జెట్‌2020 సమయంలో సోషల్‌ మీడియా వేదికగా లాభనష్టాలను చర్చించారు. ముఖ్యమైన సమాచారం షేర్‌ చేయడం, వార్తలను షేర్‌ చేయడం వంటివి ఉన్నాయి. జనవరి 30 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు రికార్డు స్థాయిలో  11 లక్షల ట్వీట్లను షేర్‌ చేశారు. ముఖ్యంగా ఆర్థిక శాఖ ప్రజానాడి తెలుసుకోవడానికి పోల్స్‌ నిర్వహించడం, లైవ్‌ స్ట్రీమ్‌ ఏర్పాటు చేయడం వంటివి చేసింది. వీటికి ప్రజా స్పందనలు ఎక్కువగా ఉన్నాయి. దీంతోపాటు బడ్జెట్‌ సమయంలో లైవ్‌ కరోజల్‌ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. దీనిలో బడ్జెట్‌ను లైవ్‌లో చూపడంతోపాటు.. నిపుణుల అభిప్రాయాలు, చర్చలు వంటివి కూడా వచ్చాయి. 

‘‘మేము  మా న్యూస్‌ పార్టనర్లతో కలిసి బడ్జెట్‌ విశేషాలు, బడ్జెట్‌పై విశ్లేషణలను భారతీయులకు అందుబాటులోకి తీసుకొచ్చాము. ఎవరికైతే బడ్జెట్‌లోని అంశాలపై అవగాహన ఉందో వారి ప్రశ్నలు, వ్యాఖ్యలను ఈ బడ్జెట్‌ ప్రసారంలో కీలక భాగం చేశాము. ఇక్కడ మేము ఒకటే చెబుతున్నాము.. ప్రపంచంలో ఏ కీలక పరిణామం జరిగినా.. దానిని భారతీయులకు  అందుబాటులోకి తెస్తాము’’ అని ట్విటర్‌ ఇండియా న్యూస్‌ పార్టనర్‌షిప్‌ విభాగానికి చెందిన అమృత త్రిపాఠి వెల్లడించారు. 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని