Ways to Invest: చిన్న పెట్టుబ‌డుల‌తో పెద్ద లాభాలు పొందాలంటే...  - 6-ways-to-invest-with-small-amount
close

Published : 10/08/2021 17:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Ways to Invest: చిన్న పెట్టుబ‌డుల‌తో పెద్ద లాభాలు పొందాలంటే... 

ఇంటర్నెట్‌ డెస్క్‌: చిన్న నీటి బిందువులు కలిసి ఒక సముద్రమవుతాయి. అలాగే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ (సిఐపిలు) రూపంలో తక్కువ మొత్తంలో డబ్బును పెట్టుబడి పెడితే కాలక్రమేణా అది పెరిగి పెరిగి మీరు ధనవంతులవుతారు. అలా తక్కువ డబ్బుతో పెట్టుబడి పెట్టడానికి కొన్ని మార్గాలు మీ కోసం... 

పరిమాణంతో సంబంధం లేకుండా పెట్టుబడి...

కీలక ఆర్థిక నిర్ణయాలను తీసుకోవడం ఆలస్యం చేస్తే... అధిక మూల్యం చెల్లించాల్సిరావొచ్చు. మనలో చాలా మంది డబ్బు విషయంలో ప్రణాళికను వాయిదా వేయడం, చివరి నిమిషం వరకు అలసత్వం వహించడం లాంటి ధోరణిలో ఉంటారు. ఇది ఏమాత్రం శ్రేయస్కరం కాదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. దాంతోపాటు పెట్టుబడులను ప్రారంభించడానికి పెద్ద మొత్తంలో డబ్బు అవసరమని చాలా మంది భావిస్తుంటారు. కానీ అది తప్పు అని నిపుణులు చెబుతున్నారు. ఆర్థిక ప్రణాళికను రూపొందించుకొని... సంపాదన మొదలు పెడితే డబ్బు విషయాలపై పట్టు సాదించగలరు.

పెట్టుబడి స్థిరంగా ఉండండి

పెట్టుబడి ప్రారంభించిన తర్వాత, దానిని స్థిరంగా ఉంచడం ముఖ్యం. పెట్టుబడులకు  క్రమశిక్షణా విధానాన్ని అనుసరించి, సరైన ఆస్తి తరగతిని ఎంచుకోవాలి. అలాగే దీర్ఘకాలిక పెట్టుబడులకు ప్రణాళిక ఉండాలి. సరైన పెట్టుబడులపై అవగాహన కలిగి ఉంటే... దీర్ఘకాలం పాటు పెట్టుబడులు పెట్టనవసరం లేదు, తెలివిగా వ్యవహరించి పెట్టుబడులను మార్చుతూ ఉండాలి. ఉదాహరణకు, మీరు స్థిర ఆదాయ సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టినప్పుడు, రిటర్న్స్ స్థిరంగా, పరిమితంగా ఉంటాయి. అయితే, దీర్ఘ కాల పెట్టుబడిదారుల ఈక్విటీలు పెద్ద ఎత్తున సంభావ్య సామర్థ్యాన్ని అందిస్తాయి. 

చిన్న పొదుపు ప్రభావం ఎంత...

నేడు పొదుపు చేసిన ఒక రూపాయి రేపు మరొక రూపాయిని సంపాదిస్తుంది. చిన్న పొదుపులు స్వల్ప కాలంలో మిమ్మల్ని ప్రభావితం చేయకపోయినా, దీర్ఘకాలంలో కచ్చితంగా సహాయపడతాయి. ఉదాహరణకు, చిన్న పొదుపు సమీకరణకు పిగ్గీ బ్యాంకు ఒక అద్భుతమైన ఉదాహరణ. ఓర్పుతో క్రమానుగుణంగా పోదుపు చేసినట్లయితే, అది చివరగా ఎంత మొత్తాన్ని సమకూరుస్తుందో తెలిస్తే మీరు ఆశ్చర్యానికి గురవుతారు. ఇలాగే అర్ధవంతంగా వృద్ధి చెందినట్లైతే, మీరు పెట్టుబడి పెట్టిన దానికంటే ఎక్కువ డబ్బును పొందుతారు.

మీ పెట్టుబడి మొత్తాన్ని కాలక్రమేణా పెంచండి

కాలక్రమేణా మీ ఆదాయం పెరుగుతుంది కాబట్టి, పెట్టుబడి మొత్తాన్నీ పెంచండి. ఒకవేళ మీ జీతం పెంచినట్లయితే, మీ పొదుపు కూడా పెంచాలి. ఆదాయం పెరుగుతుంటే, దానికి తగ్గట్టుగా ఖర్చులు పెంచకుండా... పొదుపు పెంచాలి. లేకపోతే పొదుపులో వెనుకబడిపోతాం. 

ఓర్పుతో ఉండండి... లాభాలు పొందండి

ఓర్పు, ప్రాధాన్యత లేకపోవడం వల్ల కొన్ని సందర్భాల్లో పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించే అవకాశాన్ని కోల్పోవచ్చు. మీ పెట్టుబడులపై విశ్వాసం ఉంచేలా, కాలక్రమేణా పెరిగి, గరిష్ఠ లాభాలను పొందేందుకు ఇది పరిష్కారం చూపుతుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, హెచ్చు తగ్గులనేవి పెట్టుబడి చక్రంలో భాగం మాత్రమే. ఒకవేళ ట్రెండ్స్ బలహీనపడితే, మీ విశ్వాసాన్ని కోల్పోవద్దు. కాలక్రమేణా నష్టాలు, సవాళ్లు ఎదురవుతూనే ఉంటాయి. వాటిని అధిగమించి మంచి రాబడులను పొందడానికి ప్రయత్నించండి. 

సమయం - సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్

మ్యూచువల్ ఫండ్స్‌లోలో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (ఎస్‌ఐపి) ద్వారా నెలకు రూ.500 నుంచి పెట్టుబడి పెట్టొచ్చు. అలాగే 5 నుంచి 8 సంవత్సరాల పాటు దానిని నిర్వహించవచ్చు. మీ పెట్టుబడులు సంవత్సరానికి మెరుగైన రాబడులను పొందడమే కాకుండా భవిష్యత్తులో మరిన్ని ప్రయోజనాలను పొందుతాయి. దాంతోపాటు మీకు అవసరమైన పన్ను ప్రయోజనాలనూ అందిస్తాయి. 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని