close

Published : 04/05/2021 13:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఉపాధి కోల్పోయిన‌ ఉద్యోగులు

ఈ ఏప్రిల్‌లో 73.5 ల‌క్ష‌ల‌కు పైగా భార‌తీయులు ఉద్యోగాలు కోల్పోయారు.

కోవిడ్ కేసులు ఉధృతం అయిన ఒక నెల‌లో ఉద్యోగ న‌ష్టాలు మొద‌ల‌య్యాయి. ఇది దేశంలోని అనేక ప్రాంతాల‌లో వ్యాపారాలు దెబ్బ‌తిన‌డం కూడా కార‌ణ‌మ‌య్యింది. ఫిబ్ర‌వ‌రి, మార్చి నెల‌ల్లో కొద్దిగా ఉద్యోగ న‌ష్టాలు వ‌చ్చాయి. ఇక ఏప్రిల్‌లో కోవిడ్ మ‌హామ్మారి విశ్వ‌రూపం చూపించ‌డంతో కార్మిక‌, ఉద్యోగ మార్కెట్ కుప్ప‌కూలింది. క‌నీసం 73.5 ల‌క్ష‌ల‌కు పైగా ఉద్యోగాలు పోగొట్టుకున్నారు.

సెంట‌ర్ ఫ‌ర్ మానిట‌రింగ్ ఇండియ‌న్ ఎకాన‌మీ (సీఎంఐఈ) నుండి వ‌చ్చిన స‌మాచారం ప్ర‌కారం ఉద్యోగుల సంఖ్య మార్చిలో 398.14 మిలియ‌న్ల నుండి ఏప్రిల్‌లో 390.79 మిలియ‌న్లకు ప‌డిపోయింది. జ‌న‌వ‌రిలో, భార‌త్‌లో ఉద్యోగుల సంఖ్య 400.7 మిలియ‌న్లు అని `సీఎంఐఈ` డేటా తెలిపింది. ఏప్రిల్‌లో కూడా ఉపాధి రేటు, శ్రామిక శ‌క్తి రేటు త‌గ్గుద‌ల క‌నిపించింది. నిరుద్యోగుల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరిగింది. ఆర్ధిక కార్య‌క‌లాపాల మూసివేత ఒక కార‌ణ‌మ‌ని ఆర్థిక‌వేత్త‌లు పేర్కొన్నారు.

మ‌హామ్మారి 2వ వేవ్ యొక్క సామూహిక ప్ర‌భావం ఏప్రిల్ నెల‌లోనే ఎక్కువ ఉంది. 2020లో జాతీయ లాక్‌డౌన్ ఉండ‌గా, ఈసారి అది జాతీయ‌మైన‌ది కాదు. రాష్ట్రాలు మ‌రియు ప్రాంతాలు ఈ లాక్‌డౌన్ బాధ్య‌త‌ల‌ను స్వీక‌రించాయి. మ‌రియు పాక్షిక లేదా పూర్తి అంక్ష‌ల‌ను విధించాయి. ఇది కూడా ఆర్థిక కార్య‌క‌లాపాలు త‌గ్గిపోవ‌డానికి కార‌ణ‌మ‌యి నిరుద్యోగిత పెరిగిపోయింది. ఢిల్లీ విశ్వ‌విద్యాల‌యంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక‌నామిక్ గ్రోత్‌లో ఎక‌నామిక్స్ ప్రొఫెస‌ర్ అరుప్ మిత్రా మాట్లాడుతూ, లాక్‌డౌన్ల అంక్ష‌ల్లో మొద‌టి దెబ్బ‌ప‌డేది కార్మిక మార్కెట్‌కేన‌ని తెలిపారు. కొత్త‌గా జాయిన్ అవ్వ‌డానికి సిద్ద‌ప‌డే నిరుద్యోగులు అయితే కొత్త ఉద్యోగాల గురించే ఎదురు చూడ‌టం లేదు.

సెంట‌ర్ ఫ‌ర్ మానిట‌రింగ్ ఇండియ‌న్ ఎకాన‌మీ (సీఎంఐఈ) ప్ర‌కారం, ఉపాధి రేటు మార్చిలో 37.56% నుండి ఏప్రిల్‌లో 36.79 శాతానికి ప‌డిపోయింది. ఇది నాలుగు నెల‌ల క‌నిష్టానికి చేరుకుంది. నిరుద్యోగులుగా ఇంకా చురుకుగా ఉద్యోగాల కోసం వెతికే వారి సంఖ్య మార్చిలో 15.99 మిలియ‌న్ల నుండి ఏప్రిల్‌లో 19.43 మిలియ‌న్ల‌కు పెరిగింద‌ని నెల‌వారీ డేటా చూపించింది. కోవిడ్ మ‌హామ్మారి ఇపుడు గ్రామీణ భార‌తానికి వ్యాపించ‌డం కూడా ఉద్యోగాల‌పై తీవ్ర ప్ర‌భావం చూపిస్తుంది. రిటైల్‌, హాస్పిటాలిటీ, టూరిజం, ట్రావెల్ ఇండ‌స్ట్రీస్, గృహ ఉద్యోగాలు, కార్యాల‌య స‌హాయ‌క వ్య‌వ‌స్థ‌లు వంటి అన‌ధికారిక సెమీ ఫార్మ‌ల్ విభాగాల కార్మికులు ఉద్యోగాల్లో ఏప్రిల్ నెల‌లో భారీగా కోత ప‌డింది.

జాతీయ నిరుద్యోగిత రేటు మార్చిలో 6.5% మ‌రియు ఫిబ్ర‌వ‌రిలో 6.89%తో పోలిస్తే ఏప్రిల్‌లో 7.97 శాతానికి పెరిగింది. ప‌ట్ట‌ణ నిరుద్యోగం 9.78 శాతానికి పెరిగింది. మార్చిలో 7.27 శాతంగా ఉంది. మార్కెట్లో ప‌నుల‌కు డిమాండ్ త‌గ్గిన కార‌ణంగా వ‌ల‌స కార్మికులు.. రోడ్లు, రైలు వంటి ర‌వాణా ల‌భ్య‌త కార‌ణంగా తిరిగి త‌మ సొంత ప్రాంతాల‌కు వెళ్లిపోతున్నారు. అయితే ప‌ట్ట‌ణ భార‌తదేశంలో జీతాల ఉద్యోగాలు ఇంకా గ‌త సంవ‌త్స‌రం మాదిరిగా ప్ర‌భావితమవ్య‌ లేద‌ని కార్మిక ఆర్థిక‌వేత్త కే.ఆర్‌. శ్యామ్ సుంద‌ర్ అన్నారు.

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని