యాక్టివా కస్టమర్లు @ 2.5 కోట్లు  - Activa scooter model crosses 2.5 crore customers-mark in India: HMSI
close

Updated : 07/01/2021 17:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యాక్టివా కస్టమర్లు @ 2.5 కోట్లు 

ముంబయి: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌ సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) కొత్త మైలురాయిని అధిగమించింది. ఆ కంపెనీకి చెందిన యాక్టివా స్కూటర్‌ దేశంలో 2.5 కోట్ల వినియోగదారులను సొంతం చేసుకుంది. దేశంలో తొలిసారి ఓ స్కూటర్‌ బ్రాండ్‌ ఈ మైలురాయిని చేరుకున్నట్లు హెచ్‌ఎంఎస్‌ఐ ఓ ప్రకటనలో తెలిపింది.

స్కూటర్లకు ఆదరణకు క్షీణిస్తున్న రోజుల్లో 2001లో యాక్టివాను హోండా తీసుకొచ్చింది. గత 20 ఏళ్లుగా సాంకేతికంగా ఎన్నో మార్పులు చేస్తూ వినియోగదారుల ఆదరాభిమానాలు చూరగొంటున్నామని హోండా తెలిపింది. కోటిమంది వినియోగదారులను సొంతం చేసుకునేందుకు 15 ఏళ్లు (2015లో) పట్టగా.. తర్వాతి ఐదేళ్లలోనే కొత్తగా 1.5 కోట్ల మంది వినియోగదారులను చేరుకున్నామని ఆ కంపెనీ ఎండీ, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అత్సుషి ఒగాటా పేర్కొన్నారు.

ఇవీ చదవండి..
పేటీఎం ద్వారా 2 నిమిషాల్లో ప‌ర్స‌న‌ల్ లోన్‌!
‘కొవాగ్జిన్‌’ వాలంటీర్ల నమోదు ప్రక్రియ పూర్తి


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని