close

Updated : 13/04/2021 14:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఎస్‌అండ్‌పీ సూచీ నుంచి అదానీ పోర్ట్స్‌ ఔట్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌ లిమిటెడ్‌ను తమ సస్టైనబిలిటీ సూచీ నుంచి తొలగించినట్లు ఎస్‌ అండ్‌ పీ డౌజోన్స్‌ ఇండెక్సెస్‌ వెల్లడించింది. మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్న మయన్మార్‌ సైన్యంతో ఆ సంస్థకు వ్యాపార సంబంధాలు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు పేర్కొంది. ఈ కంపెనీ యంగూన్‌లో ఓ రేవును నిర్మిస్తోంది. దీంతోపాటు మయన్మార్‌ ఎకనామిక్‌ కార్పొరేషన్‌ (ఎంఈసీ) నుంచి భూమిని లీజుకు తీసుకొంది. ఈ చర్యపై అదానీ గ్రూప్‌ స్పందించలేదు. అదానీ పోర్టు వ్యాపార విభాగం ఎంఈసీ నుంచి భూమిని లీజుకు తీసుకొన్న అంశంపై అదానీ గ్రూప్‌ గత నెలలో స్పందించింది.  ఈ ఒప్పందంలోని భాగస్వాములతో దీనిపై చర్చిస్తామని పేర్కొంది.

ఫిబ్రవరి 1వ తేదీన మయన్మార్‌లో సైన్యం తిరుగుబాటు చేసి అధికారాన్ని హస్తగతం చేసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ప్రజా ఉద్యమాలను ఉక్కుపాదంతో అణిచివేస్తోంది. ఈ క్రమంలో దాదాపు 700 మంది పౌరులు మరణించారు.  దీంతో అమెరికా, బ్రిటన్‌లు మయన్మార్‌ ఎకనామిక్‌ కారిడార్‌, మయన్మార్‌ ఎకనామిక్‌ హోల్డింగ్స్‌ పబ్లిక్‌ కంపెనీ లిమిటెడ్‌లపై ఆంక్షలు విధించాయి. ఈ నేపథ్యంలో ఎస్‌అండ్‌పీ డౌజోన్స్‌ ఈ నిర్ణయం తీసుకొంది. గురువారం ట్రేడింగ్‌ ముందు సమయానికల్లా దీనిని జాబితా నుంచి తొలగించే అవకాశముంది.

ఇవీ చదవండి

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని