ఎయిర్‌టెల్‌ బ్యాంక్‌ గ్యారెంటీలు వాడొద్దు - Airtel does not use bank guarantees
close

Updated : 25/08/2021 04:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎయిర్‌టెల్‌ బ్యాంక్‌ గ్యారెంటీలు వాడొద్దు

డాట్‌కు సుప్రీంకోర్టు ఆదేశం

దిల్లీ: వీడియోకాన్‌ టెలికాంకు చెందిన రూ.1,376 కోట్ల ఏజీఆర్‌ బకాయిలు వసూలు చేసే నిమిత్తం, మూడు వారాల పాటు భారతీ ఎయిర్‌టెల్‌ బ్యాంక్‌ గ్యారెంటీలను వాడొద్దని టెలికాం విభాగా (డాట్‌)న్ని సుప్రీం కోర్టు మంగళవారం ఆదేశించింది. భారతీ గ్రూప్‌నకు టెలికాం స్పెక్ట్రమ్‌ను వీడియోకాన్‌ విక్రయించిన విషయం తెలిసిందే. వీడియోకాన్‌ టెలికాం బకాయిలు తాము చెల్లించాల్సిన అవసరం లేదని దాఖలు చేసిన ఎయిర్‌టెల్‌ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. అయితే సమస్యలకు సంబంధించి టెలికాం డిస్‌ప్యూట్స్‌ సెటిల్‌మెంట్‌ అండ్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (టీడీశాట్‌)ను ఆశ్రయించడానికి న్యాయమూర్తులు జస్టిస్‌ ఎల్‌ నాగేశ్వర రావు, జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌, జస్టిస్‌ ఎంఆర్‌ షాలతో కూడిన బెంచ్‌ అనుమతి ఇచ్చింది. ఇంతకు ముందు తీర్పులో జోక్యం చేసుకోబోమని ఎయిర్‌టెల్‌ తరఫున వాదించిన సీనియర్‌ అడ్వకేట్‌ శామ్‌ దివాన్‌కు ధర్మాసనం స్పష్టం చేసింది.


కొచ్చర్‌పై ఆరోపణలను కోర్టుకు సమర్పించిన ఈడీ

ముంబయి: ఐసీఐసీఐ బ్యాంక్‌ మాజీ సీఈఓ చందాకొచ్చర్‌, ఆమె భర్తపై ఉన్న ఆరోపణలను ప్రత్యేక పీఎమ్‌ఎల్‌ఏ కోర్టుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) సమర్పించింది. ఐసీఐసీఐ బ్యాంక్‌-వీడియోకాన్‌ మనీలాండరింగ్‌ కేసులో ఆరోపణల సమర్పణకు సెప్టెంబరు 6 తేదీని గడువుగా మనీలాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎమ్‌ఎల్‌ఏ) కింద ఏర్పడ్డ కోర్టు నిర్ణయించింది. ఈ కేసులో చందాకొచ్చర్‌, దీపక్‌ కొచ్చర్‌లతో పాటు వీడియోకాన్‌ గ్రూప్‌ ప్రమోటరు వేణుగోపాల్‌ దూత్‌లున్నారు. గతేడాది సెప్టెంబరులో అరెస్టయిన దీపక్‌ కొచ్చర్‌ ప్రస్తుతం జైలులో జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్నారు. చందాకొచ్చర్‌, దూత్‌లకు వరుసగా ఫిబ్రవరి, మార్చిలో బెయిల్‌ మంజూరైన సంగతి తెలిసిందే. వీడియోకాన్‌ గ్రూప్‌ కంపెనీలకు రూ.300 కోట్ల వరకు చట్టవ్యతిరేకంగా రుణాల మంజూరు జరిగిందన్న ఆరోపణలపై సెప్టెంబరు 2020లోనే ఎఫ్‌ఐఆర్‌ నమోదైన విషయం తెలిసిందే.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని