అంకురాలకు అమెజాన్‌ తోడ్పాటు - Amazon‌ support for budding
close

Published : 20/01/2021 01:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అంకురాలకు అమెజాన్‌ తోడ్పాటు

స్టార్టప్‌ ఇండియాతో జట్టు

దిల్లీ: తొలిదశలో ఉన్న అంకురాలను గుర్తించి, అంతర్జాతీయ మార్కెట్లో వాటిని పరిచయం చేసే లక్ష్యంతో అమెజాన్‌ యాక్సిలరేటర్‌ ప్రోగ్రాంను ప్రారంభించింది. ఇందుకోసం స్టార్టప్‌ ఇండియాతో పాటు, సిఖోయా క్యాపిటల్‌ ఇండియా, ఫైర్‌సైడ్‌ వెంచర్స్‌తో కలిసి పనిచేయనున్నట్లు తెలిపింది.  ‘అమెజాన్‌ గ్లోబల్‌ సెల్లింగ్‌ ప్రొపెల్‌ (ఏజీఎస్‌పీ)’ కార్యక్రమంలో భాగంగా వినియోగ వస్తువుల విభాగంలో ఉన్న అంకురాలకు అంతర్జాతీయ మార్కెటింగ్‌ సదుపాయం కల్పించి, ఆ సంస్థలు మరింత విస్తరించేందుకు తోడ్పడుతుంది. యాక్సిలరేటర్‌ కార్యక్రమం కోసం అమెజాన్‌ ఒక మెంటార్‌షిప్‌ బోర్డునూ ఏర్పాటు చేసింది. ఇందులో దేశీయ అంతర్జాతీయ నిపుణులు, వెంచర్‌ క్యాపిటలిస్టులు, స్టార్టప్‌ ఇండియా నుంచి సీనియర్‌ సభ్యులు ఉంటారు. మొత్తం 10 అంకురాలను దీనికోసం ఎంపిక చేయనున్నట్లు, వీటికి ఆరు వారాల మెంటార్‌షిప్‌ ప్రోగ్రాం ఉంటుందని అమెజాన్‌ గ్లోబల్‌ ట్రేడ్‌ డైరెక్టర్‌ అభిజిత్‌ కామ్రా తెలిపారు. అందులో మూడింటిని ఎంపిక చేసి వాటికి సిఖోయా, ఫైర్‌సైడ్‌ నుంచి 50,000 డాలర్ల గ్రాంటు అందిస్తామని వెల్లడించారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని