Amazon: అమెజాన్‌ చేతికి ఎంజీఎం స్టూడియోస్‌..? - Amazon in talks to buy MGM Studios for 9bn dollars
close

Updated : 19/05/2021 05:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Amazon: అమెజాన్‌ చేతికి ఎంజీఎం స్టూడియోస్‌..?

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రఖ్యాత ఎంజీఎం స్టూడియోస్‌ను కొనుగోలు చేయడానికి అమెజాన్‌ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం. ఇందు కోసం అమెజాన్‌ దాదాపు 9 బిలియన్‌ డాలర్లు వెచ్చించేందుకు సిద్ధమైందని ఆంగ్లపత్రిక బీబీసీ పేర్కొంది. అమెరికా టెలికమ్‌ దిగ్గజం ఏటీఅండ్‌టీ  వార్నర్‌ మీడియా-డిస్కవరీలను విలీనం చేసి సరికొత్త స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన మర్నాడే అమెజాన్‌ డీల్‌ విషయం బయటకొచ్చింది. 

ప్రస్తుతం ఎంజీఎం హోల్డింగ్స్‌ సంస్థ ఎంజీఎం స్టూడియోస్‌కు యజమాని. గతేడాది చివరి నుంచి ఎంజీఎం హోల్డింగ్స్‌ దీనిని విక్రయించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఒక వేళ ఈ డీల్‌ కుదిరి.. ఎంజీఎం స్టూడియోస్‌ దక్కించుకంటే అమెజాన్‌  స్ట్రీమింగ్‌ వ్యాపారానికి అదనపు బలంగా మారుతుంది. గతే 100 ఏళ్లలో ఎంజీఎం స్టూడియోస్‌ భారీ చిత్రాలు, టెలివిజన్‌ షోలను నిర్మించింది. 

సోమవారం ఏటీఅండ్‌టీతో డీల్‌ ప్రకటించిన వార్నర్‌ బ్రదర్స్‌ వద్ద హారీపోటర్‌,బ్యాట్‌మన్‌ ఫ్రాన్ఛైజీలు ఉన్నాయి. దీని యాజమాన్యంలోని హెచ్‌బీవో, హెచ్‌బీవో మ్యాక్స్‌కు 64 మిలియన్ల వీక్షకులు ఉన్నారు. ఇక డిస్కవరీకి 88 మిలియన్ల మంది ఉన్నారు.  

 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని