‘అమెజాన్‌ పే’ బలోపేతానికి రూ.225 కోట్లు - Amazon infuses rs 225 cr to strengthen amazon pay
close

Updated : 12/03/2021 14:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘అమెజాన్‌ పే’ బలోపేతానికి రూ.225 కోట్లు

ప్రత్యర్థుల పోటీని తట్టుకునే దిశగా అడుగులు

దిల్లీ: ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ భారత్‌లోని తమ పేమెంట్స్‌ విభాగం ‘అమెజాన్‌ పే’ను మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టింది. అందులో భాగంగా రూ.225 కోట్లు వెచ్చించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు రూ.225 కోట్ల విలువ చేసే 22,50,00000 ఈక్విటీ షేర్లను ప్రస్తుతం ఉన్న వాటాదార్లకు రైట్స్‌ బేసిస్‌ కింద కేటాయించింది. ఫోన్‌పే, గూగుల్‌ పే, పేటీఎం వంటి సంస్థల నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకే ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఇదే తరహాలో అక్టోబరులో రూ.700 కోట్లు, జనవరిలో రూ1,335 కోట్లు అమెజాన్‌ పే కార్యకలాపాల బలోపేతానికి కేటాయించింది.

భారత్‌లో మార్కెట్‌ప్లేస్‌, హోల్‌సేల్‌, పేమెంట్స్‌ వంటి కార్యకలాపాలను బలోపేతం చేయడంపై అమెజాన్‌ దృష్టి సారించింది. తద్వారా భారత విపణిలో అమెజాన్‌ స్థానాన్ని సుస్థిరం చేసేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా భారత్‌లోని చిన్న, మధ్య తరహా వ్యాపారాలను ఆన్‌లైన్ వేదికపైకి తీసుకొచ్చేందుకు రూ.7000 కోట్లు పెట్టుబడిగా పెట్టనున్నట్లు అమెజాన్ సీఈవో జెఫ్‌ బెజోస్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇవీ చదవండి...

వచ్చేవారం నజారా టెక్‌ ఐపీవో

చదువుల ఖర్చులు తట్టుకునేలా..


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని