అమెరికా అప్పెంతో తెలుసా?
భారత్‌కూ రుణపడి ఉన్నట్లు వెల్లడించిన ఆ దేశ చట్టసభ్యుడు
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అప్పులు అంతకంతకూ పెరిగిపోతున్నాయంటూ ఆ దేశ కీలక చట్టసభ సభ్యుడు అలెక్స్ మూనీ అక్కడి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పైగా అధిక శాతం అప్పులు ఆ దేశానికి అన్ని రంగాల్లో సవాల్ విసురుతున్న చైనా నుంచి వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భారత్‌కు సైతం 216 బిలియన్ డాలర్లు రుణపడి ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆ దేశ అప్పులు 29 ట్రిలియన్ డాలర్లకు చేరినట్లు తెలిపారు.
2020 నాటికి అమెరికా జాతీయ అప్పులు 23.4 ట్రిలియన్ డాలర్లుగా ఉన్నాయని మూనీ తెలిపారు. అంటే ఆ దేశంలో ఒక్కొక్కరిపై సగటున 72,309 డాలర్ల అప్పు ఉన్నట్లు వివరించారు. గత ఏడాది కాలంలో తీసుకున్న అప్పును ఒక్కొక్కరికీ పంచితే 10,000 డాలర్లు వస్తుందని తెలిపారు. పైగా ఇలా తెచ్చిన రుణాలన్నీ ఎక్కడికి వెళుతున్నాయనే వివరాల్లో తప్పుడు సమాచారం ఉందని ఆరోపించారు. అమెరికాకు మిత్ర దేశాలు కానీ చైనా, జపాన్‌కే ఎక్కువగా రుణపడి ఉన్నామని వ్యాఖ్యానించారు. ఈ రెండు దేశాల్లో ఒక్కోదానికి ఒక ట్రిలియన్ డాలర్లకు పైగా అమెరికా రుణపడి ఉందని తెలిపారు. రెండు ట్రిలియన్ డాలర్ల విలువ చేసే కరోనా ఉద్దీపన పథకాన్ని వ్యతిరేకిస్తూ అక్కడి చట్టసభలో మూనీ ఈ వ్యాఖ్యలు వెల్లడించారు.
2000 సంవత్సరంలో 5.6 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న అమెరికా అప్పులు ఒబామా హయాంలో రెండింతలైనట్లు మూనీ తెలిపారు. దీన్ని రోజురోజుకీ పెంచుతూ పోతున్నామని.. దీంతో జీడీపీలో అప్పుల నిష్పత్తి నియంత్రణలో లేకుండా పోతోందని వివరించారు. ఈ నేపథ్యంలో కొత్త ఉద్దీపన పథకాన్ని ఆమోదించే ముందు వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకోవాలని ఆయన తోటి చట్టసభ సభ్యులను కోరారు. ఈ పథకంలో చాలా వరకు నిధులు కరోనా ఉపశమన పథకాలకు వెళ్లబోవని ఆరోపించారు.
ఇవీ చదవండి...
వచ్చే అయిదేళ్లకూ ద్రవ్యోల్బణ లక్ష్యం 4 శాతమే
మరిన్ని
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. క్రెడిట్ స్కోర్ తెలుసుకోవడం ఎలా?
-
Q. హలో సర్, నేను 20 ఏళ్ళ పాటు మ్యూచువల్ ఫండ్స్ లో నెల నెలా రూ. 1500 మదుపు చేయాలనుకుంటున్నాను. మంచి ఫండ్స్ సూచించండి.
-
Q. నమస్తే సర్, నేను ఒక ప్రైవేట్ ఉద్యోగిని. నెలసరి జీతం రూ. 12 వేలలో రూ. 7800 ఖర్చులు పోనీ మిగతా మొత్తని పొదుపు చేయాలనుకుంటున్నాను. సలహా ఇవ్వండి.