ఓటీపీకి అవాంతరాలు.. ట్రాయ్‌ కీలక నిర్ణయం - Amid disruptions TRAI suspends norms for commercial text messages for one week
close

Published : 09/03/2021 19:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఓటీపీకి అవాంతరాలు.. ట్రాయ్‌ కీలక నిర్ణయం

దిల్లీ: వాణిజ్యపరమైన ఎస్సెమ్మెస్‌లు, ఓటీపీలు అందుకోవడంలో అవాంతరాలు తలెత్తిన నేపథ్యంలో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్‌) కీలక నిర్ణయం తీసుకుంది. వాణిజ్య సందేశాల నియంత్రణ కోసం తెచ్చిన నూతన నిబంధనలను అమలును వారంపాటు వాయిదా వేసింది. దీంతో సంస్థలు టెంప్లేట్‌లను అప్‌డేట్‌ చేసుకునే వీలు దొరుకుతుందని, కస్టమర్లకు ఇబ్బందులుండవని ట్రాయ్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ విషయాన్ని టెలికాం సంస్థలకు తెలియజేసినట్లు ట్రాయ్‌ పేర్కొంది. లావాదేవీల సమయంలో ఓటీపీలు రావడంలో సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో ట్రాయ్‌ ఈ నిర్ణయం తీసుకుంది.

అవాంచిత, మోసపూరిత సందేశాలకు చెక్‌ పెట్టేందుకు ట్రాయ్‌ కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. వినియోగదారులకు వాణిజ్య సందేశాలు పంపే సంస్థలు మెసేజ్‌ హెడ్డర్‌, టెంప్లేట్స్‌ను టెలికాం ఆపరేటర్ల వద్ద రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. సదరు సంస్థ నుంచి వచ్చే ఎస్సెమ్మెస్‌ గానీ, ఓటీపీ గానీ అంతకుముందు రిజిస్టరైన వివరాలతో బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ ఆధారంగా టెలికాం సంస్థలు సరిపోల్చుతాయి. దీన్నే ఎస్సెమ్మెస్‌ స్క్రబ్బింగ్‌ అంటారు. ఈ నిబంధనలు సోమవారం నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఓటీపీలు రావడంలో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో ట్రాయ్‌ పై నిర్ణయం తీసుకుంది. నిర్దేశించిన నిబంధనలను పాటించడంలో కొన్ని సంస్థలు విఫలమవ్వడంతో అవి పంపిన సందేశాలు వినియోగదారులకు చేరలేదని ట్రాయ్‌ పేర్కొంది.

ఇవీ చదవండి..

టెల్కోల కొత్త నిబంధనలు..నిలిచిపోయిన ఓటీపీలు!

బ్యాంకు లాకర్ నియమ నిబంధనలు మీకు తెలుసా? 


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని