FAME II: యాంపియర్‌ ఈవీ స్కూటర్లపై భారీ తగ్గింపు - Ampere Electric Scooters Become More Affordable
close

Published : 19/06/2021 20:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

FAME II: యాంపియర్‌ ఈవీ స్కూటర్లపై భారీ తగ్గింపు

ముంబయి: ప్రముఖ విద్యుత్తు వాహన తయారీ సంస్థ యాంపియర్ వెహికల్స్ తమ వాహన శ్రేణిలోని ఎలక్ట్రిక్‌ స్కూటర్లపై భారీ తగ్గింపు ప్రకటించింది. తాజాగా ఫేమ్‌-2 (Faster Adoption and Manufacturing of Electric Vehicles in India Phase II) సబ్సిడీని కేంద్రం సవరించింది. ఇందులో భాగంగా జీల్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ధరను రూ.68,990 నుంచి రూ.59,990కి.. మాగ్నస్ ప్రో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ధరను రూ.74,990 నుంచి రూ.65,990కి తగ్గిస్తున్నట్లు యాంపియర్ వెహికల్స్ ప్రకటించింది. ప్రభుత్వం కల్పిస్తున్న ప్రయోజనాలను వినియోగదారులకు బదిలీ చేయడంలో భాగంగానే ధరలను తగ్గించినట్లు యాంపియర్‌ ఎలక్ట్రిక్‌ సీఓఓ రాయ్‌ కురియన్ వెల్లడించారు.

ఇటీవల ఫేమ్‌-2 పథకంలో కేంద్రం కొన్ని సవరణలు చేసింది. ఎలక్ట్రిక్‌ వాహన తయారీదారులకు ప్రస్తుతం 1KWhకు ₹10వేలు చొప్పున ఇస్తున్న సబ్సిడీని ₹15 వేలకు పెంచుతున్నట్లు కేంద్రం పేర్కొంది. వాహనం ఖరీదులో గరిష్ఠంగా 40 శాతం వరకూ ఈ ప్రోత్సాహకాలను అందించనున్నారు. గతంలో ఇది 20 శాతం మాత్రమే ఉండేది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని