కోల్‌ ఇండియా వాటాదార్లకు అదనంగా 20-25% డివిడెండు - An additional 20-25pct dividend to Coal India shareholders
close

Published : 14/06/2021 01:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కోల్‌ ఇండియా వాటాదార్లకు అదనంగా 20-25% డివిడెండు

నేడు ప్రకటించే అవకాశం!

దిల్లీ: వాటాదార్లకు కోల్‌ ఇండియా అదనంగా 20-25% డివిడెండును చెల్లించే అవకాశం ఉంది. దీనిపై సోమవారం (ఈనెల 14న) సంస్థ ప్రకటన చేస్తుందని తెలుస్తోంది. ఆ రోజే నాలుగో త్రైమాసిక ఫలితాలను కూడా సంస్థ వెల్లడిస్తుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 2020-21 సంవత్సరానికి ఉత్పత్తి లక్ష్యాన్ని అందుకోవడంలో విఫలమైనప్పటికీ.. సవరించిన మూలధన వ్యయాల లక్ష్యాన్ని మాత్రం కోల్‌ ఇండియా అధిగమించింది. ‘మరోమారు డివిడెండును ప్రకటించేందుకు బోర్డు ప్రయత్నిస్తోంది. అయితే రూ.10 ముఖ విలువ గల ఒక్కో షేరుపై ఇచ్చిన రెండు మధ్యంతర డివిడెండులు రూ.7.5, రూ.5 కంటే తక్కువగానే ఉండే అవకాశం ఉంద’ని ఆ వర్గాలు తెలియజేశాయి. ‘రెండు మధ్యంతర డివిడెండుల మొత్తం రూ.12.50. మొత్తం తుది డివిడెండు ఒక్కో షేరుకు రూ.15 కంటే తక్కువగా ఉండాలంటే తుది డివిడెండు రూ.2- 2.50గా ప్రకటించాల్సి ఉంటుంద’ని పేర్కొన్నాయి.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని