close

తాజా వార్తలు

Published : 22/09/2020 01:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కమొడిటీలకు ప్రత్యామ్నాయ నష్ట నివారణ వ్యవస్థ

దిల్లీ: కమొడిటీ ఫ్యూచర్‌ కాంట్రాక్టులు దాదాపు సున్నా స్థాయికి లేదా ప్రతికూల ధరలకు (మైనస్‌) చేరినప్పుడు.. ఆ సమస్య పరిష్కరించేందుకు ప్రత్యామ్నాయ నష్ట నియంత్రణ వ్యవస్థను సెబీ అందుబాటులోకి తెచ్చింది. ఇటీవల అంతర్జాతీయంగా కమొడిటీ ధరలు తీవ్రమైన ఒడుదొడుకుల్లో కదలాడిన సంగతి విదితమే. చమురు ధరలు ఊహించిన విధంగా సున్నా స్థాయికి పడిపోవడమే కాకుండా ఆ తర్వాత మైనస్‌లోకీ జారుకున్నాయి. ఇలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు.. ఫ్యూచర్‌ ధరలకు 100 శాతం సమానమైన మార్జిన్లు కూడా సరిపోవని సెబీ తెలిపింది. ఈ సమస్యకు పరిష్కారం చూపే ఉద్దేశంతో ప్రత్యామ్యాయ నష్ట నివారణ వ్యవస్థను సెబీ అందుబాటులోకి తెచ్చింది. ఈ వ్యవస్థను సమీక్షించేందుకు క్లియరింగ్‌ కార్పొరేషన్‌, మార్కెట్‌ పార్టిసిపెంట్లతో ఓ టాస్క్‌ఫోర్సు ఏర్పాటు చేసినట్లు సెబీ తెలిపింది. ఈ టాస్క్‌ఫోర్స్‌ ఇచ్చే సిఫారసుల ఆధారంగా శూన్య, ప్రతికూల ధరల్లోకి జారిన కమొడిటీస్‌/ ఫ్యూచర్లకు ప్రత్యామ్నాయ నష్ట నియంత్రణ వ్యవస్థ వర్తిస్తుందని సెబీ నిర్ణయించింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.