వార్షిక ఆదాయమే..కీలకం
టర్మ్ పాలసీ కొనుగోలు సమయంలో వార్షిక ఇన్కమ్ ఫ్రూఫ్.. తప్పనిసరిగా బీమా సంస్థలు కోరతాయి. ఆన్లైన్లోనే కాకుండా ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేసిన పాలసీలకు ఇనకమ్ ఫ్రూఫ్ ఇవ్వాల్సిందే. ఒక వ్యక్తికి ఎంత వరకు బీమా ఇవ్వచ్చు అనే అంశాన్ని వార్షిక ఆదాయం ఆధారంగానే నిర్ణయిస్తాయి బీమా సంస్థలు. అందువల్ల పాలసీ కొనుగోలు చేసేవారు ఇన్కమ్ ఫ్రూవ్ సిద్దంగా ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఎందుకు చెప్పాలి?
కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణించినప్పుడు, ఆ స్థానంలో కుటుంబానికి అండంగా ఉండేదే టర్మ్‌బీమా. అందువల్ల ఎంత ఆదాయం ఉంటుందో తెలిస్తే, ఎంత కవరేజ్ ఇస్తే ప్రయోజకరంగా ఉంటుందో తెలుస్తుంది. కాబట్టి వార్షిక ఆదాయం గురించి బీమా సంస్థలకు తప్పనిసరిగా తెలియపరచాలి.
బీమా చేసిన వారు ప్రీమియంలను సకాలంలో చెల్లించడం చాలా ముఖ్యం. అప్పుడే పాలసీలో ఉన్న అన్ని ప్రయోజనాలను పొందగలుగుతారు. మీరు సమయానికి ప్రీమియంలు చెల్లిచగలుగుతారా.. లేదా.. అనే విషయాలన్ని మీ సంపాదన సామర్ధ్యం, ఆర్థిక ఆదాయాల ద్వారా బీమా సంస్థ అంచనా వేస్తుంది.
ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు, ఉద్యోగ హోదా వంటి ఇతర వివరాలు కూడా తెలిజేయాల్సి ఉంటుంది. ప్రత్యేకించి ఎక్కువ రిస్క్ ఉన్న చోట విధులను నిర్వహించే వారు, సీనియారిటీ, అనుభవం, ఎంత శాతం రిస్క్ ఉంటుంది అనే వివరాలను తెలపాలి. వీటి ఆధారంగా కూడా ఎంత బీమా అవసరమో లెక్కిస్తారు.
ఆదాయ ఫ్రూఫ్ ఎందుకు ఇవ్వాలి?
హామీ మొత్తం లేదా మీకు అందించే మొత్తం జీవిత కవరేజీని నిర్ణయించడంలో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్(ఆర్థిక నివేదికలు) సహాయపడుతాయి. అంతేకాకుండా అధిక బీమా అవకాశాన్ని నివారిస్తాయి. పాలసీదారుడు అసలు నగదు విలువ కంటే ఎక్కువ కవరేజీని కొనుగోలు చేస్తే, అది బీమా సంస్థకు ప్రమాదం కావచ్చు.
అందువల్ల ఆదాయ ప్రకటనలో వ్యత్యాసం ఉండకూడదు. అంటే దరఖాస్తు ఫారంలో తెలియజేసిన ఆదాయం, ఇన్కమ్ ఫ్రూఫ్‌లో ఉన్న ఆదాయాలు వేరువేరుగా ఉండకూడదు. ఒకవేళ ఉంటే బీమా సంస్థ క్లెయిమ్‌లను తిరస్కరిస్తుంది. భవిష్యత్తులో అంటే క్లెయిమ్ చేసే సమయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే, బీమా కొనుగోలు సమయంలోనే ఇన్కమ్ ఫ్రూవ్ ఇవ్వడం మంచిది.
మరిన్ని
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. డియర్ సిరీ! నేను ప్రస్తుతం క్రింద పేర్కొన్న ఫండ్స్ లో ప్రతినెలా 8000/- (ఒక్కో ఫండ్ లో రూ.1000/- చొప్పున) SIP చేస్తున్నాను. 1. Axis midcap fund 2. DSP world gold fund 3. Edelweiss Greater china equity offshore fund 4. ICICI Pru US bluechip equity fund 5. IDFC G-Sec fund constant maturity plan 6. IDFC Nifty fund 7. Mirae Asset emerging blue chip fund 8. Nippon india nifty smallcap 250 index fund ఈ పోర్ట్ ఫోలియో లో ఏమైనా మార్పులు చేర్పులు అవసరమైతే సూచించగలరు.
-
Q. నమస్తే సిరి. నా పేరు రవికుమార్. నాకు 3 సం.ల బాబు ఉన్నాడు. నాకు టర్మ్ ఇన్సూరెన్స్, అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఉన్నాయి. ఒక్కొక్క వెయ్యి చొప్పున RD & PPF లో మదుపు చేస్తున్నాను.అలాగే axis Blue chip ఫండ్ లో కూడా మదుపు చేస్తున్నాను. బాబు భవిష్యత్ కోసం మంచి మ్యూచువల్ ఫండ్స్ సూచించండి. గ్రో యాప్ ద్వారా ఫండ్స్ లో మదుపు చేయడం మంచిదేనా?
-
Q. నేను రూ. 1 కోటి బీమా హామీ తో టాటా ఏఐఏ, హెచ్డీఎఫ్సి నుంచి 2019 లో టర్మ్ పాలసీ తీసుకున్నాను. అప్పట్లో హెచ్డీఎఫ్సీ వారు నన్ను మెడికల్ రిపోర్ట్ కోరలేదు. క్లెయిమ్ సమయం లో ఇబ్బందులు రాకుండా ఇప్పుడు నేను లేటెస్ట్ రిపోర్ట్ రెండు కంపెనీస్ కి ఇచ్చే అవకాశం ఉందా?