అనుపమ్ రసాయన్ ఐపీవోకు సెబీ గ్రీన్ సిగ్నల్
దిల్లీ: ప్రత్యేక రసాయనాల తయారీ కంపెనీ ‘అనుపమ్ రసాయన్’ ఐపీవోకు మార్కెట్ నియంత్రణాధికార సంస్థ సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిసెంబరులో కంపెనీ దరఖాస్తు చేసుకోగా ఫిబ్రవరి 26న దానిపై పరిశీలన ప్రారంభించింది. ఈ ఐపీవో ద్వారా మొత్తం సదరు కంపెనీ రూ.760 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీన్ని ప్రధానంగా రుణాల చెల్లింపునకు వినియోగించనున్నట్లు నివేదికలో కంపెనీ పేర్కొంది.
సూరత్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ కంపెనీ.. కొన్ని వాటాలను తమ ఉద్యోగుల కోసం రిజర్వ్ చేయాలని భావిస్తున్నట్లు పేర్కొంది. వీలైతే అర్హత కలిగిన సిబ్బందికి రాయితీ కూడా ఇవ్వాలని అనుకుంటున్నట్లు పేర్కొంది. 1984లో కార్యకలాపాలు ప్రారంభించిన అనుపమ్ రసాయన్.. అనేక దశల్లో ప్రాసెస్ చేయాల్సిన కృత్రిమ రసాయనాల్ని తయారు చేస్తుంటుంది. మొత్తం 23,396 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన ఆరు తయారీ కేంద్రాలు ఉన్నాయి. ముఖ్యంగా అగ్రో కెమికల్, పర్సనల్ కేర్, ఔషధ రంగాల్లో వాడే రసాయనాలను తయారు చేస్తుంటారు. ఈ ఐపీవోకు ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్, జేఎం ఫైనాన్షియల్ మర్చంట్ బ్యాంకర్లుగా వ్యవహరించనున్నారు.
ఇవీ చదవండి...
రూ.10లక్షల బడ్జెట్లో మంచి మైలేజ్ ఇచ్చే కార్లు
పెట్రోల్, డీజిల్పై సుంకాలు తగ్గిస్తారా?
మరిన్ని
మీ ప్రశ్న
సిరి జవాబులు
-
Q. క్రెడిట్ స్కోర్ తెలుసుకోవడం ఎలా?
-
Q. హలో సర్, నేను 20 ఏళ్ళ పాటు మ్యూచువల్ ఫండ్స్ లో నెల నెలా రూ. 1500 మదుపు చేయాలనుకుంటున్నాను. మంచి ఫండ్స్ సూచించండి.
-
Q. నమస్తే సర్, నేను ఒక ప్రైవేట్ ఉద్యోగిని. నెలసరి జీతం రూ. 12 వేలలో రూ. 7800 ఖర్చులు పోనీ మిగతా మొత్తని పొదుపు చేయాలనుకుంటున్నాను. సలహా ఇవ్వండి.