Apna: అంకుర సంస్థలోకి రూ.513 కోట్ల పెట్టుబడులు - Apna Recieved 70 million dollars as investments
close

Published : 16/06/2021 15:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Apna: అంకుర సంస్థలోకి రూ.513 కోట్ల పెట్టుబడులు

బెంగళూరు: ఉద్యోగ కల్పనే లక్ష్యంగా బెంగళూరు కేంద్రంగా ఏర్పాటైన అంకుర సంస్థ ‘అప్నా’ యాప్‌లోకి భారీ ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. కార్మికులు, అసంఘటిత రంగంలోని ఉద్యోగులు, నైపుణ్యం అవసరం లేని ఉద్యోగులకు ఉపాధి చూపడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ సంస్థలోకి టైగర్‌ గ్లోబల్, ఇన్‌సైట్‌ పార్ట్‌నర్స్‌ 70 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు (సుమారు రూ. 513 కోట్లు) పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఈ నిధులతో సంస్థ సేవలను మరింత విస్తృతపరచడంతో పాటు సాంకేతికతను మెరుగుపరచడం, ప్రతిభ గల ఉద్యోగులను నియమించుకోవడం, అమెరికా, ఆగ్నేయాసియా ప్రాంతాలకు సంస్థ కార్యకలాపాలను విస్తరించడానికి తాజా నిధులను వినియోగించనున్నట్లు సంస్థ వెల్లడించింది. కొవిడ్‌ కష్టకాలంలో ఉపాధి కోల్పోయిన అనేక మందికి అప్నా ద్వారా ఉద్యోగ అవకాశాలను చేరువ చేస్తున్నామని పేర్కొంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని