ఆర్సెలర్‌ మిత్తల్‌కు కొత్త సీఈఓ.. ఎవరంటే - ArcelorMittal announces Aditya Mittal as New Chairman And CEO
close

Updated : 11/02/2021 19:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆర్సెలర్‌ మిత్తల్‌కు కొత్త సీఈఓ.. ఎవరంటే

ఛైర్మన్‌, సీఈఓగా నియమితులైన ఆదిత్య మిత్తల్‌

లక్సెంబర్గ్‌: ప్రపంచంలోనే అతి పెద్ద ఉక్కు ఉత్పత్తి సంస్థ ఆర్సెలర్‌ మిత్తల్‌ నూతన ఛైర్మన్‌, సీఈఓగా ఆదిత్య మిత్తల్‌ను ప్రకటించారు. తన తండ్రి, కంపెనీ వ్యవస్థాపకుడు, భారత సంతతికి చెందిన లక్ష్మీ మిత్తల్‌ నుంచి ఆయన ఈ బాధ్యతలను చేపట్టనున్నారు. కాగా, లక్ష్మీ మిత్తల్‌ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా కొనసాగుతారు. లక్సెంబర్గ్‌ ప్రధాన కేంద్రంగా గల ఈ దిగ్గజ సంస్థ అరవై దేశాల్లో స్టీలు, మైనింగ్‌ కార్యకలాపాలతో తన ఉనికిని చాటుకుంది.. పదిహేడు దేశాల్లో ఉక్కునిర్మాణ రంగంలో ఉంది. 2006లో ఆర్సెలర్‌ సంస్థతో మిత్తల్‌ స్టీల్‌ విలీనమై ప్రస్తుతమున్న ఆర్సెలర్‌ మిత్తల్‌ ఏర్పడిన సంగతి తెలిసిందే.

ఆదిత్య  ప్రస్తుతం ఆర్సెలర్‌ మిత్తల్‌ చీఫ్‌ ఫైనాన్సియల్‌ ఆఫీసర్‌ (సీఎఫ్‌ఓ)గా వ్యవహరిస్తున్నారు. ఈయనను సంస్థ సీఈఓ పదవికి ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్టు కంపెనీ డైరెక్టర్ల బోర్డు ప్రకటించింది. 46 ఏళ్ల ఆదిత్య  1997లో ఆర్సెలర్‌ మిత్తల్‌లో చేరారు. అంతకు ముందు ఆయన క్రెడిట్‌ సుజీ అనే ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ సంస్థలో పనిచేశారు. కరోనా వైరస్‌ ప్రభావం ప్రపంచంలో అన్ని రంగాలపై, సంస్ధలపై పడినా.. ఆర్సెలర్‌ మిత్తల్‌ నాలుగవ త్రైమాసికంలో పుంజుకుని లాభాల బాట పట్టడం గమనార్హం.

ఇవీ చదవండి..

ఒడిదుడుకులను దాటుకుని లాభాల్లోకి..

మహిళా ఉక్కు సంకల్పం


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని