అశోక్‌ లేలాండ్‌ 4 యాక్సిల్‌ ట్రక్‌ - Ashok Leyland 4 axle truck
close

Updated : 27/03/2021 04:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అశోక్‌ లేలాండ్‌ 4 యాక్సిల్‌ ట్రక్‌

దిల్లీ: హిందూజా సంస్థ అశోక్‌ లేలాండ్‌ 4 యాక్సిల్‌, 14 చక్రాల ట్రక్‌ ఏవీటీఆర్‌ 4120ని ఆవిష్కరించింది. ఈ ట్రక్‌నకు 40.5 టన్నుల స్థూల వాహన బరువు సామర్థ్యం ఉందని సంస్థ తెలిపింది. ఇదేతరహా వాహనాలతో పోలిస్తే, 5 టన్నుల సరకును అదనంగా తీసుకెళ్లగలిగే సామర్థ్యం ఈ వాహనం సొంతమని అశోక్‌ లేలాండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ విపిన్‌ తెలిపారు. భిన్న అవసరాలకు ఈ వాహనాన్ని వినియోగించుకోవచ్చని, 200 హెచ్‌పీ ఇంజిన్‌, కంపెనీకి పేటెంట్‌ ఉన్న 12.5 టన్నుల డ్యూయల్‌ టైర్‌ లిఫ్ట్‌ యాక్సిల్‌ను దీనికి అమర్చామని వివరించారు.
నమోదిత మధ్యవర్తిత్వ సంస్థల వ్యాపార బదిలీకి కొత్త నిబంధనలు: సెబీ
దిల్లీ: నమోదిత మధ్యవర్తిత్వ సంస్థల (ఇంటర్మీడియరీస్‌) వ్యాపార బదిలీకి సంబంధించి కొత్త రిజిస్ట్రేషన్‌ నిబంధనల్ని క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ శుక్రవారం తీసుకొచ్చింది. ఒక చట్టపరమైన సంస్థ వ్యాపారాన్ని (సెబీ నియంత్రిత వ్యాపార కార్యకలాపాలు) సెబీ నమోదిత మధ్యవర్తి (బదిలీదారు) నుంచి మరో చట్టపరమైన సంస్థకు (ట్రాన్స్‌ఫరీ) బదిలీ చేయడానికి రిజిస్ట్రేషన్‌ దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు సెబీ తెలిపింది. బదిలీ చేయించుకునే సంస్థ అదే సామర్థ్యంతో నమోదు చేయకపోయి ఉన్నట్లయితే, వ్యాపార బదిలీకి ముందే సెబీ నుంచి తాజాగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. బదిలీదారు రిజిస్ట్రేషన్‌ నంబర్‌ కాకుండా కొత్త నమోదు సంఖ్యను ట్రాన్స్‌ఫరీకి జారీ చేస్తామని సెబీ తెలిపింది. నియంత్రణలో మార్పునకు అనుగుణంగా అదే చట్టపరమైన సంస్థకు తాజా నమోదును మంజూరు చేస్తున్నపుడు, ఆ రిజిస్ట్రేషన్‌ సంఖ్యను అలాగే ఉంచుతామని పేర్కొంది. బదిలీదారు ఉనికిలో లేనట్లయితే, దాని రిజిస్ట్రేషన్‌ తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుందని తెలిపింది. బదిలీదారు వ్యాపారాన్ని పూర్తిగా బదిలీ చేస్తే రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ను సరెండర్‌ చేయాలని, ఒకవేళ పాక్షికంగా బదిలీ చేస్తే మాత్రం ఆ సర్టిఫికెట్‌ను తమ వద్ద ఉంచుకోవచ్చని సెబీ పేర్కొంది.

సంక్షిప్తంగా..
* భూషణ్‌ పవర్‌ అండ్‌ స్టీల్‌ను కొనుగోలు చేసే పరిష్కార ప్రణాళికలో భాగంగా ఆ కంపెనీ ఆర్థిక రుణదాతలకు రూ.19,350 కోట్లు చెల్లించినట్లు జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ తెలిపింది.
* స్టెరిలైట్‌ పవర్‌ నుంచి ఎన్‌ఈఆర్‌-2 ట్రాన్స్‌మిషన్‌ను రూ.4,625 కోట్ల ఎంటర్‌ప్రైజ్‌ విలువతో కొనుగోలు చేసినట్లు ఇండిగ్రిడ్‌ వెల్లడించింది.
* తమ అనుబంధ సంస్థ మహీంద్రా ఎలక్ట్రిక్‌ మొబిలిటీని తమ సంస్థలో విలీనం చేసేందుకు బోర్డు సూత్రప్రాయ ఆమోదం తెలిపిందని ఎంఅండ్‌ఎం ఎక్స్ఛేంజీలకు సమాచారమిచ్చింది. భవిష్యత్‌కు సిద్ధంగా ఉండటానికి విద్యుత్‌ వాహనాలు ప్రధాన వ్యాపారంలో భాగం కావాలని కంపెనీ భావిస్తున్నట్లు తెలిపింది.
* నుమాలిగర్‌ రిఫైనరీలో 61.5 శాతం వాటాను ఆయిల్‌ ఇండియా, ఇంజినీర్స్‌ ఇండియా, అస్సోం ప్రభుత్వాలకు రూ.9876 కోట్లకు విక్రయించినట్లు బీపీసీఎల్‌ ప్రకటించింది.
* బ్యారెల్‌ ముడిచమురు ధర సగటున 65 డాలర్లు ఉంటేనే, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన చమురు, రసాయనాల వ్యాపారంలో 20 శాతం వాటాను సౌదీ ఆరామ్‌కో కొనుగోలు చేయొచ్చనే అంచనాను పరిశోధనా సంస్థ జెఫ్రీస్‌ పేర్కొంది.
* కంపెనీల సున్నిత సమాచారాన్ని స్టాక్‌ఎక్స్ఛేంజీల కంటే ముందే తెలుసుకోవడం ద్వారా, అవాంఛిత లాభం పొందారనే ఆరోపణలకు సంబంధించి శ్రుతివిశాల్‌ వోరా తదతరులపై సెబీ జారీచేసిన ఆదేశాలను సెక్యూరిటీస్‌ అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ పక్కనపెట్టింది.
* ఆన్‌లైన్‌లో సౌందర్య ఉత్పత్తులను విక్రయించే పర్పుల్‌.కామ్‌ 4.5 కోట్ల డాలర్ల నిధులను సమకూర్చుకుంది. రాబోయే 4-5 ఏళ్లలో 8-10 రెట్ల మేరకు వృద్ధి సాధించేందుకు ఈ మొత్తాన్ని వినియోగించుకుంటున్నట్లు సంస్థ సీఈఓ మనీశ్‌ తనేజా తెలిపారు.


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని