వైమానిక దళానికి బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాలు - Ashok Leyland Delivers Bullet Proof Vehicles to IAF
close

Published : 17/04/2021 13:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వైమానిక దళానికి బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాలు

మొదటి విడత డెలివరీ పూర్తి: అశోక్‌ లేలాండ్‌

దిల్లీ: భారత వైమానిక దళానికి తేలికపాటి బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాల (ఎల్‌బీపీవీ) మొదటి విడత సరఫరా పూర్తి చేశామని అశోక్‌ లేలాండ్‌ తెలిపింది. లాక్‌హీడ్‌ మార్టిన్‌కు చెందిన సీవీఎన్‌జీ (కామన్‌ వెహికల్‌ నెక్ట్స్‌జెన్‌) వెర్షన్‌ ఆధారంగా తయారుచేసిన ఈ అధునాతన వాహనాలను 13న అందజేశామని ఎక్స్ఛేంజీలకు కంపెనీ తెలియజేసింది. లాక్‌హీడ్‌ మార్టిన్‌ నుంచి అశోక్‌ లేలాండ్‌కు సాంకేతిక బదలాయింపుతో ఈ వాహనాలను అభివృద్ధి చేశామని, భారత్‌లోనే పూర్తిగా వీటిని తయారు చేశామని పేర్కొంది. బురద, ఇసుక, రాళ్లు ఉన్న రహదారులతో పాటు తక్కువ లోతున్న నీళ్లపైనా ఈ ఎల్‌బీపీవీలు సునాయాసంగా వెళ్లగలవు. ఇందులో ఆరుగురు ప్రయాణం చేసేందుకు వీలుండటంతో పాటు సామగ్రి పెట్టుకునేందుకు తగినంత స్థలమూ ఉంటుంది. తుపాకి గుళ్ల దాడి నుంచే కాదు బాంబు పేలుళ్ల నుంచి కూడా ఇవి రక్షణ కల్పిస్తాయి. ‘సైనిక దళాలకు వాహనాలను సరఫరా చేయడాన్ని ఎంతో గర్వించదగిన విషయంగా మేం భావిస్తున్నాం. వాహనాల సరఫరా ద్వారా దేశానికి మా వంతు సేవను అందించే అవకాశం రావడం ఆనందంగా ఉంద’ని అశోక్‌ లేలాండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్, సీఈఓ విపిన్‌ సోంది అన్నారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని