ఆడీ కొత్త కారు @79.06 లక్షలు - Audi S5 Sportback launched in India
close

Published : 22/03/2021 17:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆడీ కొత్త కారు @79.06 లక్షలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ ఆడీ భారత్‌లో కొత్త ఎస్‌5 స్పోర్ట్‌బ్యాక్‌ కారును సోమవారం విడుదల చేసింది. లగ్జరీ సెడాన్‌ సెగ్మెంట్‌లో వస్తున్న ఈ ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ ధరను రూ.79.06 లక్షలుగా (ఎక్స్‌షోరూం) నిర్ణయించారు. ఎస్‌5 స్పోర్ట్‌ బ్యాక్‌ను 2017లోనే భారత్‌కు తీసుకొచ్చారు. తాజాగా దీనిలో మరిన్ని అత్యాధునిక ఫీచర్లు జోడిండచడంతో పాటు ఔటర్‌ డిజైన్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఇప్పుడు కారు మరింత స్పోర్టీ లుక్‌ను సంతరించుకుంది. షార్పర్‌ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, డీఆర్‌ఎల్‌లు అదనపు ఆకర్షణ. యాంగులర్‌ బంపర్‌, క్వాడ్‌ టిప్‌ ఎగ్జాస్ట్‌లు, 19 అంగుళాల అలాయ్ వీల్స్‌, స్పాయిలర్‌తో.. కొత్త ఎస్‌5 స్పోర్ట్‌బ్యాక్‌ ఆకట్టుకుంటోంది.

పది అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్‌ తెర, 12.2 అంగుళాల డిజిటల్‌ ఎంఐడీ తెర, ఫ్లాట్‌ బాటమ్‌ స్టీరింగ్ వీల్‌ ఈ కారులో ఉన్నాయి. 3.0 ట్విన్‌ టర్బో, వీ6 పెట్రోల్‌ ఇంజిన్‌ను అమర్చారు. ఇది గరిష్ఠంగా 354 హెచ్‌పీ శక్తిని, 500 ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. 8-స్పీడ్‌ ట్రిప్‌ట్రోనిక్‌ గేర్‌బాక్స్‌ను ఇచ్చారు. 4.8 సెకన్లలో గంటకు 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. గరిష్ఠంగా గంటకు 250 కి.మీ వేగంతో ప్రయాణించొచ్చు. డైనమిక్‌, కంఫర్ట్‌, ఎఫీషియెన్సీ, ఆటో, ఇండివిడ్యువల్‌ అనే ఐదు డ్రైవింగ్‌ మోడ్‌లు దీనిలో ఉన్నాయి. పూర్తిగా తయారు చేసిన యూనిట్‌(సీబీయూ)గా దీన్ని దిగుమతి చేసుకోనున్నారు. మెర్సిడెస్‌-ఏఎంజీ సీ 43, మెర్సిడెస్‌ బెంజ్‌ జీఎల్‌సీ 43 ఏఎంజీ, బీఎండబ్ల్యూ ఎం340ఐకి ఈ కారు పోటీ ఇవ్వనుంది.

ఇవీ చదవండి...

కొత్త కారా.. కొన్నాళ్లు ఆగాల్సిందే

కియా విద్యుత్తు కారు ఈవీ6


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని