close

తాజా వార్తలు

విడిభాగాల రంగంలో లక్ష ఉద్యోగాలు కట్‌

దిల్లీ: తయారీ రంగంలో మందగమనం వాహన విడి భాగాల తయారీ రంగంపైనా పడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి అర్ధ భాగంలో ఈ రంగం తీవ్ర గడ్డు పరిస్థితి ఎదుర్కొంది. జులై నెల వరకు ఈ రంగంలో లక్ష మంది తాత్కాలిక ఉద్యోగులు తమ కొలువులు కోల్పోయినట్లు ఆటోమోటివ్‌ కాంపోనెంట్‌ మానుఫాక్చరర్స్‌ అసోసియేషన్‌ (ఏసీఎంఏ) తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ -సెప్టెంబర్‌ మధ్య ఈ రంగం టర్నోవర్‌ రూ.1.79 లక్షల కోట్లు నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో టర్నోవర్‌ రూ1.99 లక్షల కోట్లు నమోదు కావడం గమనార్హం. అంటే గతంతో పోలిస్తే టర్నోవర్‌ 10.1 శాతం తగ్గింది. మందగమనం ఫలితంగా 2 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి కూడా ఈ కాలంలో నష్టపోయినట్లు ఏసీఎంఏ తెలిపింది.

ఆటోమోటివ్‌ పరిశ్రమ దీర్ఘకాలంగా మందగమనం ఎదుర్కొంటోందని, అన్ని సెగ్మెంట్ల వాహన విక్రయాల్లో ఏడాది కాలంగా క్షీణత కనిపిస్తోందని ఏసీఎంఏ అధ్యక్షుడు దీపక్‌ జైన్‌ తెలిపారు. వాహన రంగంపై విడిభాగాల పరిశ్రమ ఆధారపడి ఉందని, 15-20 శాతం మేర తగ్గిన వాహనాల ఉత్పత్తి ప్రభావం విడిభాగాల తయారీ పరిశ్రమపైనా పడిందని చెప్పారు. గతేడాది అక్టోబర్‌ నుంచి ఈ ఏడాది జులై మధ్య ఉద్యోగాలు పోయాయని తెలిపారు. ముఖ్యంగా తాత్కాలిక ఉద్యోగాలు కొలువులు కోల్పోయారని జైన్‌ వెల్లడించారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.