ఫిబ్రవరిలో పుంజుకున్న వాహన విక్రయాలు - Auto sales up In Feb
close

Updated : 01/03/2021 13:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఫిబ్రవరిలో పుంజుకున్న వాహన విక్రయాలు

దిల్లీ: ఫిబ్రవరి నెలలో వాహన విక్రయాలు భారీగా పుంజుకున్నాయి. ఆయా సంస్థల విక్రయాల్లో భారీ వృద్ధి నమోదైంది. ప్రముఖ వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో అమ్మకాలు ఆరు శాతం పెరిగాయి. 2020, ఫిబ్రవరిలో ఈ సంస్థ 3,54,913 యూనిట్లను విక్రయించగా.. ఈసారి 3,75,017 యూనిట్లను అమ్మారు. అయితే దేశీయ విక్రయాల్లో మాత్రం రెండు శాతం క్షీణత కనిపించింది. 2020లో ఫిబ్రవరిలో భారత్‌లో 1,68,747 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఆ సంఖ్య గత నెలలో 1,64,811 యూనిట్లకు తగ్గింది. ఇక బజాజ్‌ ద్విచక్ర వాహన విక్రయాల్లో ఏడు శాతం వృద్ధి నమోదైంది. గత ఏడాది ఫిబ్రవరిలో 3,10,222 యూనిట్లు అమ్ముడు కాగా, ఈసారి అవి 3,32,563 యూనిట్లను విక్రయించారు. ఇక వాణిజ్య వాహనాల అమ్మకాలు ఐదు శాతం తగ్గాయి. 2020 ఫిబ్రవరిలో 44,691 యూనిట్లను విక్రయించగా.. ఈ సారి ఆ సంఖ్య 42,454కు పరిమితమైంది. ఇక ఎగుమతులు భారీగా పుంజుకున్నాయి. గత ఏడాదిలో 1,86,166 యూనిట్లు ఎగమతి కాగా.. ఆ సంఖ్య ఈసారి 13 శాతం పెరిగి 2,10,206 యూనిట్లకు పరిమితమైంది.

* మారుతీ సుజుకీ విక్రయాల్లో 11.8 శాతం వృద్ధి నమోదైంది. అయితే, మినీ కార్లు అయిన ఎస్‌-ప్రెసో, ఆల్టోలో మాత్రం అమ్మకాలు 12.9 శాతమ మేర క్షీణించాయి. ఇక కాంపాక్ట్‌ సెగ్మెంట్‌లోని స్విఫ్ట్‌, సెలెరియో, ఇగ్నిస్‌, బాలెనో, డిజైర్‌ విక్రయాలు 15.3 శాతం పుంజుకున్నాయి. మిడ్‌ సైజ్‌ సెడాన్‌ విభాగంలో 40.6 శాతం క్షీణత కనిపించింది. యుటిలిటీ వెహికల్ విభాగంలోని విటారా బ్రెజా, ఎస్‌-క్రాస్‌, ఎర్టిగా అమ్మకాలు 18.9 శాతం పుంజుకున్నాయి. ఇక ఎగుమతులు 11.9 శాతం ఎగబాకాయి.

* మరో ప్రముఖ వాహన తయారీ సంస్థ టొయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ అమ్మకాలు 36 శాతం ఎగబాకాయి. ఫిబ్రవరిలో మొత్తం 14,075 యూనిట్లను విక్రయించినట్లు సంస్థ వెల్లడించింది. వీటిలో 10,352 యూనిట్లు దేశీయంగానే అమ్మినట్లు తెలిపింది.

* ఇక ఎంజీ మోటార్‌ ఇండియా విక్రయాలు మూడింతలైనట్లు సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. గత ఏడాది ఫిబ్రవరిలో 1,376 యూనిట్లు విక్రయించగా.. ఈ సారి 4,329 యూనిట్లను అమ్మినట్లు వెల్లడించింది.

* అశోక్‌ లేల్యాండ్‌ విక్రయాలు 19 శాతం పుంజుకున్నాయి. మొత్తం 13,703 యూనిట్లు అమ్ముడుపోగా.. వీటిలో 12,776 యూనిట్లు దేశీయంగానే విక్రయమైనట్లు వెల్లడించింది. మీడియం అండ్‌ కమర్షియల్‌ వెహికల్స్‌ విభాగం విక్రయాల్లో ఐదు శాతం వృద్ధి నమోదైంది. లైట్‌ కమర్షియల్‌ వెహికల్స్‌ 46 శాతం పెరిగాయి.

* హ్యుందాయ్‌ అమ్మకాలు 26.4 శాతం ఎగబాకాయి. గత ఏడాది ఫిబ్రవరిలో 48,910 యూనిట్లు అమ్ముడుకాగా.. ఈసారి అవి 61,800కి పెరిగాయి. దేశీయ విక్రయాల్లో 29 శాతం వృద్ధి నమోదైంది. ఎగుమతులు 14.6 శాతం పెరిగాయి.

ఇవీ చదవండి...

గంటకు 200 కి.మీ వేగం

బజాజ్‌ పల్సర్‌ 180 రిటర్న్స్


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని