బీఎండబ్ల్యూ 6 సిరీస్‌ సెడాన్‌ - BMW 6 SERIES SEDAN
close

Published : 09/04/2021 16:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బీఎండబ్ల్యూ 6 సిరీస్‌ సెడాన్‌

దిల్లీ: బీఎండబ్ల్యూ ఆధునికీకరించిన 6 సిరీస్‌ సెడాన్‌ను భారత విపణిలోకి విడుదల చేసింది. దీని ధర రూ.67.9 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌). పెట్రోల్‌ రకం 630ఐ ఎం స్పోర్ట్‌ ధర రూ.67.9 లక్షలు కాగా.. డీజిల్‌ రకం 630డి ఎం స్పోర్ట్‌ ధర రూ.68.9 లక్షలు, బీఎం 620డి లగ్జరీ లైన్‌ ధర రూ.77.9 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. 2-లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌తో 630ఐ రూపొందింది. ఇది 258 హెచ్‌పీ సామర్థ్యంతో 6.5 సెకన్లలోనే 100 కి.మీటర్ల గరిష్ఠ వేగాన్ని అందుకుంటుంది. 2-లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌తో రూపొందిన 620డి 190 హెచ్‌పీ సామర్థ్యంతో 7.9 సెకన్లలో 100 కి.మీ.ల గరిష్ఠ వేగాన్ని అందుకుంటుంది. 3-లీటర్‌ 6-సిలిండర్‌ డీజిల్‌ ఇంజిన్‌తో రూపొందిన 630డి 265 హెచ్‌పీ సామర్థ్యంతో 6.1 సెకన్లలో 100 కి.మీ.ల గరిష్ఠ వేగాన్ని అందుకుంటుంది.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని