భారత్‌లో బీఎండబ్ల్యూ నుంచి 6 నెలల్లో 3 ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ - BMW to launch three electric vehicles in next 6 months in India
close

Updated : 25/11/2021 20:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత్‌లో బీఎండబ్ల్యూ నుంచి 6 నెలల్లో 3 ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌

దిల్లీ: భారత్‌లో విద్యుత్‌ వాహనాలను తీసుకొచ్చే విషయంలో జర్మనీకి చెందిన కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ దూకుడు మీద ఉంది. రాబోయే ఆరు నెలల్లో మూడు ఎలక్ట్రిక్‌ వాహనాలను తీసుకొస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇందులో ఎస్‌యూవీతో పాటు, మినీ లగ్జరీ హ్యాచ్‌బ్యాక్‌, సెడాన్‌ కార్లు ఉండనున్నాయని ఆ కంపెనీ తెలిపింది. రాబోయే 180 రోజుల్లో బీఎండబ్ల్యూ నుంచి పూర్తి ఎలక్ట్రిక్‌ ఉత్పత్తులను తీసుకొస్తున్నట్లు ఆ కంపెనీ ఇండియా అధ్యక్షుడు, సీఈవో విక్రమ్‌ పావహ్‌ తెలిపారు.

‘‘రాబోయే 30 రోజుల్లో బీఎండబ్ల్యూ iX పేరిట పూర్తి ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీని తీసుకొస్తున్నాం. 90 రోజుల్లో మినీ ఎలక్ట్రిక్‌ వాహనాన్ని, 180 రోజుల్లో పూర్తి ఎలక్ట్రిక్‌ సెడాన్‌ i4 వాహనాన్ని తీసుకురాబోతున్నాం’’ అని పావహ్‌ తెలిపారు. ఐఎక్స్‌ మోడల్‌ను ఇప్పటికే అమెరికా, యూరప్‌లో విడుదల చేశామని చెప్పారు. ఇంట్లోనే ఛార్జింగ్‌ పెట్టుకునేందుకు వీలుగా హోమ్‌ ఛార్జింగ్‌ కిట్‌ను అందిస్తామన్నారు. 35 నగరాల్లో డీలర్‌ నెట్‌వర్క్‌ వద్ద ఫాస్ట్‌ ఛార్జర్లను ఏర్పాటు చేస్తామని వివరించారు.

Read latest Business News and Telugu News


Advertisement

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని